Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోరిక తీరిస్తే మార్కులేస్తా.. నీ నగ్న వీడియో పంపు : విద్యార్థిని టీచర్ వేధింపులు

Advertiesment
Sanga Reddy
, గురువారం, 29 జులై 2021 (08:22 IST)
నా కోరిక తీరిస్తేనే మంచి మార్కులు వేస్తా.. దానికంటే ముందుగా నీ నగ్న వీడియో తీసి నాకు వాట్సాప్‌లో పంపించు అంటూ ఓ విద్యార్థినికి ఓ కామాంధ అధ్యాపకుడు పెట్టిన షరతులు. ఆన్‌లైన్‌ క్లాసుల పేరిట విద్యార్థిని ఫోన్‌ నెంబర్‌ తీసుకుని, వికృతంగా ప్రవర్తించాడు. ఈ ప్రైవేట్ కాలేజీ టీచర్ వికృత చేష్టలను భరించలేలని ఆ విద్యార్థిని కీచక ఉపాధ్యాయుడి గురించి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకివచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్‌లో ఉన్న సెయింట్‌ ఆంథొనీస్‌ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న నిందితుడు వినయ్‌ రాజ్‌, ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసుల్ని నిర్వహిస్తున్నాడు. 
 
ఈ క్రమంలో ఓ విద్యార్థినితో వాట్సాప్‌లో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెకు తరచూ అశ్లీల సందేశాలు పంపుతూ లైంగిక వేధింపులకు ఒడిగట్టాడు. నగ్న వీడియోలు పంపాలని, తన గదికి వచ్చి కోరిక తీర్చాలని వేధించాడు. అలా చేస్తేనే ఎక్కువ మార్కులు వేస్తానని, లేదంటే ఫెయిల్‌ చేస్తానని బెదిరించాడు.
 
అతడి ఆగడాలను భరించలేక బాధితురాలు తల్లిదండ్రులతో చెప్పడంతో, వారు కళాశాల దృష్టికి తీసుకు వెళ్లారు. అయితే.. అతడు ఒంగోలులో ఉంటున్నాడని, ఆ వేధింపులతో తమకు సంబంధం లేదని కళాశాల ప్రతినిధులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో బాలిక తల్లిదండ్రులు సంగారెడ్డి పట్టణ పోలీసులను ఆశ్రయించారు. వారు కేసు నమోదు చేసి, వినయ్‌ రాజ్‌ను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ: 24 గంటల్లో 20వేల కేసులకు పైగా నమోదు