Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షార్‌ సెంటర్‌కు పులికాట్‌తో ముప్పు ... సముద్రపు అలలతో భయం

Advertiesment
షార్‌ సెంటర్‌కు పులికాట్‌తో ముప్పు ... సముద్రపు అలలతో భయం
, బుధవారం, 28 జులై 2021 (14:57 IST)
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారతీయ అంతరిపక్ష పరిశోధా సంస్థకు చెందిన రాకెట్ ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)కు ముప్పు పొంచివుంది. ఒకవైపు సముద్రపు అలలు భయపెడుతున్నాయి. మరోవైపు.. పులికాట్ సరస్సుతో సైతం షార్‌కు ముంపు పొంచి ఉంది. దీంతో షార్ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇప్పటికే సముద్రపు భారీ అలల కారణంగా షార్‌లోని చాలా భాగాలు ధ్వంసమయ్యాయి. ఈ అలల కారణంగానే ఇవి దెబ్బతింటున్నాయి. రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. బహుళ ప్రయోజక ఓడరేవులు, సముద్ర మార్పుల వల్ల ఇలా జరుగుతుందేమో అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 

దేశానికే తలమానికంగా ఉన్న ఈ రాకెట్ ప్రయోగ కేంద్రానికి ఒకవైపున సముద్రం, మరోవైపున పులికాట్‌ సరస్సు ఉంది. దీంతో నాలుగు వైపులా నీరు ఆవరించి ఉంటుంది. దేశ అంతరిక్ష చరిత్రలో ఎన్నో సువర్ణ అధ్యాయాలను లిఖించిన షార్‌ను సముద్రపు అలలు భయపెడుతున్నాయి. 

శ్రీహరికోటలో సముద్రానికి కిలో మీటరు దూరంలో రెండు ప్రయోగవేదికలు ఉన్నాయి. ఇక్కడి తీరం క్రమంగా కోతకు గురవుతోంది. గత పదేళ్లలో 250 నుంచి 350 మీటర్ల వరకు కోతకు గురైంది. గతంలో షార్‌ ఆధ్వర్యాన తీరంలో నిర్మించిన పలు వంతెనలు ధ్వంసమయ్యాయి. అనంతరం ప్రత్యామ్నాయంగా కొత్తవి నిర్మించారు. ప్రస్తుతం ఇవీ ప్రమాదపు అంచునే ఉన్నాయి. 

గత యేడాది నవంబరులో కురిసిన భారీ వర్షాలకు షార్‌ తీరంలో చందరాజకుప్పం వద్ద సముద్రం ముందుకొచ్చింది. అలలు ఎగసి పడటంతో ఉత్తర కేటీఎల్‌ ప్రాంతంలోని కోస్టల్‌ రోడ్డు కొన్ని చోట్ల దెబ్బతింది. ఆ సమయంలో తీరం సుమారు 150 మీటర్ల వరకు కోసుకుపోయింది. ఈ షయం తెలిసిన తర్వాత నిరుడు ఇస్రో అధిపతి డాక్టర్‌ శివన్‌ సైతం క్షేత్రస్థాయిలో పరిశీలించి వెళ్లి పరిశీలించాలు. 

కోతకు కారణాలు, పరిష్కార మార్గాలు కనుగొనాలని చెన్నైకి చెందిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కోస్టల్‌ రీసెర్చ్‌(ఎన్‌సీసీఆర్‌) శాస్త్రవేత్తలను షార్‌ యాజమాన్యం కోరింది. శ్రీహరికోట సమీపంలోని వాకాడు మండలం నవాబుపేట, మొనపాళెం, కొండూరుపాళెం, శ్రీనివాసపురం, వడపాళెం, మంజకుప్పం గ్రామాల్లోనూ ఇదే సమస్య నెలకొంది. 

మూడు నెలలపాటు.. శాస్త్రవేత్తల బృందం మూడు నెలలుగా వివిధ కోణాల్లో అధ్యయనం చేస్తోంది. శ్రీహరికోట ఉత్తరం వైపు తీరంలో పలుమార్లు పరిశీలించి, అక్కడ కోతకు కారణాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. మానవ కార్యకలాపాల కారణంగానూ తీరప్రాంతాలు కోతకు గురవుతున్నట్లు గుర్తించారు. దాంతోపాటు అల్పపీడన వ్యవస్థలు, సముద్ర మట్టం మార్పులు పెరిగినట్లు తెలుసుకున్నారు. 

తీరంలో తరంగ శక్తి ఎక్కువగా ఉండటంతోనూ సమస్య ఉత్పన్నమవుతున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఓడరేవుల ఏర్పాటుతోనూ సమస్య తమిళనాడు ప్రాంతంలో సముద్ర తీరంలో వివిధ బహుళ ప్రయోజక ఓడరేవులు ఏర్పాటయ్యాయి. వాటికి ఉత్తరాన శ్రీహరికోట ఉంది. ఓడరేవుల్లో నిర్మాణ కార్యకలాపాలు, భారీ షిప్పుల రాకపోకల కారణంగా అలలపై ఒత్తిడి పెరుగుతోంది. దాని ప్రభావం శ్రీహరికోట తీరంపై కనిపిస్తోందని శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాను కలవరపెడుతున్న డెల్టా.. మాస్కులు ధరించాలంటూ..