Publish Date: Sat, 24 Jul 2021 (13:48 IST)
Updated Date: Sat, 24 Jul 2021 (13:49 IST)
భారీ వర్షాల కారణంగా... తెలంగాణలోని మూడు జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది. మరో రెండు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
దీంతో అప్రమత్తమయిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది.
వరదల వల్ల ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పెద్దవాగులో తొమ్మిదిమంది కార్మికులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులను తలపిస్తున్నాయి.
ఇప్పటికే పలు జిల్లాలు జలదిగ్బంధమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయి జన జీవనం స్థంభించింది.