Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియుడితో భార్య రాసలీలలు.. షాక్ ఇచ్చిన భర్త..!

Advertiesment
Affair
హైదరాబాద్ లో ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి రాసలీలలు చేస్తుండగా భర్త రెడ్ హ్యాండెడ్ పట్టుకొని ప్రియుడిని కర్రతో కొట్టి చంపేశాడు. ఈ దారుణం హైదరాబాద్ లోని కొత్తపేటలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే... సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నివాసి అయిన రవి... తన భార్య, కుమారుడితో కలిసి హైదరాబాద్ కి వచ్చి కొత్తపేటలో నివాసం ఉంటున్నాడు. రవి భార్యది సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మాచనూరు గ్రామం. అయితే అదే గ్రామానికి చెందిన 24 ఏళ్ళ కె.ప్రణీత్‌రెడ్డికి ఈమెకు చిన్నతనం నుంచే బాగా పరిచయం. 

ప్రణీత్ రెడ్డి తన వ్యక్తిగత అవసరాలకై హైదరాబాద్‌కి తరుచుగా వచ్చి వెళ్తుండేవాడు. అలా హైదరాబాద్ వచ్చి వెళ్తున్న ప్రణీత్ రెడ్డికి రవి భార్యకి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. రవి ఇంట్లో లేని సమయం చూసి ప్రణీత్ ఆమె ఇంటికి వెళ్లి రాసలీలలు కొనసాగించేవాడు. ఇలా వాళ్ళ రాసలీలలు కొనసాగుతూ ఉండడంతో, ఒకరోజు రవికి ఈ విషయం తెలిసింది.

ఆగ్రహంతో ఊగిపోయిన రవి.. వాళ్ళని పట్టుకుందాం అని ఓ పక్క ప్రణాళికను వేశాడు. దీంతో సోమవారం రోజు రవి తన భార్యతో పనికి వెళ్తున్నానని చెప్పి బయటకి వెళ్ళిపోయాడు.  

భార్య కొద్దిసేపు ఆగి తన ప్రియుడిని ఇంటికి రప్పించుకుంది. ఇక ఎప్పటిలాగానే బెడ్‌రూమ్‌లో రాసలీలల్లో మునిగితేలుతున్న సమయంలో భర్త ఇంట్లోకి వెళ్లి వారిద్దరికీ షాక్ ఇచ్చాడు. వెంటనే 3 ఏళ్ళ కొడుకుని, భార్యని బయటకి పంపి ప్రియుడి తలపై గట్టిగ కర్రతో కొట్టాడు. దాంతో ప్రణీత్ రెడ్డికి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మరణించాడు. 
 
తర్వాత రవి చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వలన ఇప్పటికే చాలామంది చచ్చిపోయారు అయినా ఇలాంటివి కొనసాగుతూనే ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ ఐదుగురు జడ్జీలకు అదనపు భద్రత