Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌లో ఏప్రిల్‌ 29న ఇన్నర్‌‌పీస్‌కు ఆతిథ్యమివ్వనున్న ఆర్‌ఎస్‌ఎం

image
, బుధవారం, 19 ఏప్రియల్ 2023 (18:05 IST)
విజయవంతమైన ఇన్నర్‌పీస్‌కు దగ్గరలో, ఒక మార్గదర్శక ధ్యాన సదస్సును ఈ నెలారంభంలో నిర్వహించిన రామాశ్రమ్‌ సత్సంగ్‌ మథుర ఇంక్‌ (ఆర్‌ఎస్‌ఎం ఇంక్‌) ఇప్పుడు హైదరాబాద్‌లో ఏప్రిల్‌ 29వ తేదీన ఇన్నర్‌ పీస్‌, గైడెడ్‌ మెడిటేషన్‌ సదస్సును నిర్వహించనుంది. ఆర్‌ఎస్‌ఎం ఇంక్‌ అనేది అమెరికన్‌ లాభాపేక్ష లేని సంస్ధ. సత్సంగ్‌ ద్వారా ఆరోగ్యవంతమైన, శాంతియుతమైన జీవనశైలిని ప్రోత్సహిస్తుంది. ఈ పద్ధతిని సామ్రాట్‌ గురు చతుర్భుజ్‌ సహాయ్‌ జీ( గురు మహారాజ్‌) అభివృద్ధి చేశారు.
 
ఇటీవల హైదరాబాద్‌లో  నిర్వహించిన క్యాంపెయిన్‌లో 150 మంది హాజరయ్యారు. ఈ సదస్సుకు మెడిటేషన్‌ టీచర్‌ శ్రీ సంజీవ్‌ కుమార్‌ నేతృత్వం వహించారు. ఈ కార్యక్రమం గచ్బిబౌలిలోని ఓక్‌ఉడ్‌ బాంక్విట్‌లో నిర్వహించారు. శ్రీ సంజీవ్‌ జీ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు పర్యటించడంతో పాటుగా ఇన్నర్‌ పీస్‌ సాధించడానికి అత్యున్నత మార్గాలను వెల్లడించారు. దాదాపు 40నిమిషాల పాటు నిశ్శబ్దంగా, అతీంద్రియంగా సాగే లైట్‌ మెడిటేషన్‌, హాజరైన వ్యక్తులకు పునరుజ్జీవన, విశ్రాంత అనుభవాలను అందిస్తుంది.
 
ఈ సదస్సు పూర్తయిన తరువాత పాల్గొన్న అభ్యర్థులు తమ అనుభవాలను పంచుకోవడంతో పాటుగా పరివర్తక అనుభవంగా నిర్వచించారు. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్న వ్యక్తులకు ధ్యానంను తమ జీవితంలో భాగం చేసుకోవాల్సిందిగా ఉద్భోదించారు. ఈ దిశగా సహాయపడటానికి, ప్రతి నెలా శ్రీ మోహిత్‌ కుమార్‌, శ్రీ అమిత్‌ కుమార్‌లు హైదరాబాద్‌లో మరియు శ్రీ సంజీవ్‌ జి ఆన్‌లైన్‌లో సదస్సులను నిర్వహించనున్నారు. ఈ సత్సంగ్‌తో వ్యక్తులు తమ ఇన్నర్‌సెల్వ్స్‌తో అనుసంధానించబడటంతో పాటుగా ఒత్తిడి తగ్గించుకుని ఆందోళన దూరంగా పెట్టగలరు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనాను అధికమించిన భారత్ .. ఏ విషయంలో?