Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫోన్ చేస్తే చాలు.. మీ ఇంటికే మామిడి

Advertiesment
ఫోన్ చేస్తే చాలు.. మీ ఇంటికే మామిడి
, మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (19:24 IST)
లాక్‌డౌన్‌ కొనసాగుతున్న తరుణంలో జంట నగర వాసులకు ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండానే మామిడి పండ్లను అందించేందుకు తెలంగాణ ఉద్యాన శాఖ సిద్ధమైంది. ఈ మేరకు తపాలాశాఖతో ఒప్పందం కుదుర్చుకుంది.

మీరు కోరిన 4, 5 రోజుల్లో పండ్లు ఇంటికి పంపిస్తామని ఉద్యాన శాఖ సంచాలకులు బి.వెంకటరెడ్డి చెప్పారు. నేరుగా మామిడి తోటల నుంచి పక్వానికి వచ్చిన కాయలను సేకరించి.. వాటిని శాస్త్రీయంగా అట్టపెట్టెలో మగ్గపెట్టి అలాగే అందిస్తారు. 5 కిలోల మామిడి పండ్ల బుట్టలో 12-15 వరకూ ఉంటాయని చెప్పారు.

మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. ఎన్ని కిలోలు కావాలి.. ఏ రకం మామిడి పండ్లు అనేది చెబితే చాలు..! రైతుల దగ్గర అందుబాటులో ఉండే రకాలు.. మీకు కావాల్సిన మామిడి పండ్ల పరిమాణాన్ని బట్టి ధరలో వ్యత్యాసం ఉంటుంది.
 
నగదు చెల్లింపులు ఇలా..
మామిడి పండ్లు కావాల్సిన వారు ఎంత మొత్తంలో కావాలనుకుంటున్నారో అనే విషయాలను ఈ కింది నంబర్లకు వాట్సాప్‌ చేయాలని ఉద్యాన శాఖ సూచించింది. 79977 24925, 79977 24944 నంబర్లను వినియోగించాలని కోరింది.
 
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఈ ఫోనులో అందుబాటులో ఉంటారని స్పష్టం చేసింది.
* గూగుల్‌ పే, ఫోన్‌పే ద్వారా నగదు చెల్లించాలనుకునేవారు.. 79977 24925 నంబరును వినియోగించాలని సూచించింది.
 
* బ్యాంక్‌ అకౌంట్‌ ద్వారా చెల్లించాలనుకుంటే అకౌంట్‌ నంబరు 013910100083888, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌: ఏఎన్‌డిబీ0000139, ఆంధ్రాబ్యాంక్‌, గగన్‌మహల్‌ శాఖలో జమ చేయాలి.
 
* వినియోగదారులు పూర్తి చిరునామా, పిన్‌కోడ్‌ నంబరుతో పాటు ఫోను నంబరును సందేశం ద్వారా పంపించాలి.
* 5 కిలోల బంగినపల్లి మామిడి పండ్ల పెట్టె ధర తపాలా శాఖ ద్వారా ఇంటికి పంపే ఖర్చులతో సహా రూ.350గా నిర్ధారించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేపటి నుంచి కడపలో మాంసం విక్రయాలు