Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లాక్‌డౌన్ వేళ గృహ హింస నుండి మహిళలకు పూర్తి రక్షణ..తక్షణ సహాయం కోసం ఫోన్ నెంబర్లు

Advertiesment
లాక్‌డౌన్ వేళ గృహ హింస నుండి మహిళలకు పూర్తి రక్షణ..తక్షణ సహాయం కోసం ఫోన్ నెంబర్లు
, మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (19:08 IST)
క‌రోనా కష్ట కాలంలో దీర్ఘకాల లాక్‌డౌన్ నేపధ్యంలో గృహహింసను ఎదుర్కుంటున్న మహిళలకు ఏపీ మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ బాసటగా నిలుస్తోంది. వారికి పూర్తి రక్షణను కల్పించే క్రమంలో పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది.

ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇప్పటికే పనిచేస్తున్న దిశ వన్ స్టాప్ కేంద్రాలలో 24గంటలు సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. గృహహింసకు గురవుతున్న మహిళలకు ఇక్కడ అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. 

బాధితులకు ఆరోగ్య, వైద్య, మానసిక, సాంఘిక, న్యాయ సహాయాలు నిపుణుల ద్వారా ఒకే చోట అందించేలా మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ  చర్యలు తీసుకుంది. మరోవైపు ఇరవై నాలుగు గంటలు ఉచిత న్యాయ, వైద్య, పోలీస్ సంరక్షణతో పాటు అత్యవసర వసతి కూడా ఇక్కడ అందించబడుతుంది.

వన్ స్టాప్ సెంటర్స్‌కు వైద్య శాఖ, పోలీసు శాఖ ప్రత్యక్ష సహాయ సహకారాలను అందిస్తుండగా  రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ విభిన్న శాఖల మధ్య సమన్వయ బాధ్యతలను సైతం పర్యవేక్షిస్తుందని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు, దిశ ప్రత్యేక అధికారి డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు.

ఈ వన్‌స్టాప్ సెంటర్లలో లభించే అన్ని సేవలు ఉచితమేనని, ఈ కేంద్రాలలో మాత్రమే కాకుండా  రాష్ట్రంలో గల 23 స్వధార్ గృహములలో సైతం బాధిత మహిళలకు వసతి, రక్షణ ఉచితంగా అందిస్తున్నామని వివరించారు.

మహిళాభద్రత పరంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారని, ఏ ఒక్కరూ గృహ హింసకు లోను కారాదని సూచించారని సిఎం అదేశాల మేరకు తమ శాఖ సష్టమైన కార్యాచరణతో ముందడుగు వేస్తోందన్నారు. 

ఇదే క్రమంలో ఉచిత మహిళా సహాయతా సంఖ్య 181 కూడా బాధితుల సహాయార్ధం 24 గంటలు  పనిచేస్తుందని కృతికా శుక్లా తెలిపారు. ఉచిత మహిళా సహాయతా సంఖ్య 181తో పాటు జిల్లాలలో తక్షణ సహాయం కోసం  తమ శాఖ నిర్ధేశించిన ఫోన్ నెంబర్లకు కూడా కాల్ చేయవచ్చని సంచాలకులు వివరించారు. 

శ్రీకాకుళం – 9110793708
విజయనగరం – 8501914624
విశాఖపట్నం – 6281641040
తూర్పు గోదావరి – 9603231497
పశ్చిమ గోదావరి – 9701811846
కృష్ణ – 9100079676
గుంటూరు – 9963190234
ప్రకాశం – 9490333797
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు – 9848653821
చిత్తూరు – 9959776697
కర్నూలు – 9701052497
వైఎస్ఆర్ కడప  8897723899
అనంతపురము – 8008053408

ఈ నెంబర్లలో రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ జిల్లా స్ధాయి అధికారులు అందుబాటులో ఉంటారని, నిస్పంకోచంగా ఎటువంటి సహాకారం కావాలన్నా ఈ నెంబర్లకు అయా జిల్లాల పరిధిలోని వారు ఫోన్ చేయవచ్చని డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చలికాలం వస్తే మళ్లీ చైనాలో కరోనా విజృంభిస్తుందట..