హైదరాబాద్‌లో పోలియో వైరస్ గుర్తింపు.. అధికారుల్లో కలకలం
హైదరాబాద్ నగరంలో మరోసారి పోలియో వైరస్ కలకలం రేగింది. అంబర్ పేట్- నాగోల్ మూసీనది నాలాలో పోలియో వైరస్‌ను అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.
హైదరాబాద్ నగరంలో మరోసారి పోలియో వైరస్ కలకలం రేగింది. అంబర్ పేట్- నాగోల్ మూసీనది నాలాలో పోలియో వైరస్‌ను అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.
కాగా, భారత్‌ను పోలియో రహిత దేశంగా ఐక్యరాజ్య సమితి ఆరోగ్యం విభాగం ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో.. భారత్‌లో పోలియో వైరస్‌ను అధికారులు గుర్తించడం కలకలం రేపింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.