Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

‘నా ఇంటికే కరెంట్ కట్ చేస్తానంటావా? నువ్వెంత? నీ బతుకెంత?’ లైన్‌మెన్‌పై పరిగి ఎమ్మెల్యే బూతు పురాణం

విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించలేని ఓ ప్రజాప్రతినిధి.. విద్యుత్ బోర్డుకు చెందిన లైన్‌మెన్‌పై ఆగ్రహోద్రుక్తుడయ్యాడు. పైగా, అందరు వింటుండానే బండబూతులు తిట్టాడు. ‘నా ఇంటికే కరెంట్ కట్ చేస్తానంటావా? న

‘నా ఇంటికే కరెంట్ కట్ చేస్తానంటావా? నువ్వెంత? నీ బతుకెంత?’ లైన్‌మెన్‌పై పరిగి ఎమ్మెల్యే బూతు పురాణం
, శుక్రవారం, 3 మార్చి 2017 (09:09 IST)
విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించలేని ఓ ప్రజాప్రతినిధి.. విద్యుత్ బోర్డుకు చెందిన లైన్‌మెన్‌పై ఆగ్రహోద్రుక్తుడయ్యాడు. పైగా, అందరు వింటుండానే బండబూతులు తిట్టాడు. ‘నా ఇంటికే కరెంట్ కట్ చేస్తానంటావా? నువ్వెంత? నీ బతుకెంత?’ అంటూ బూతు పురాణం వినిపించారు. ఆ ఎమ్మెల్యే పేరు రామ్మోహన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా పరిగి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
విద్యుత్ బిల్లు కింద సుమారు రూ.50 వేలు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి బకాయిపడ్డాడు. సంబంధిత అధికారుల ఆదేశాల మేరకు బకాయి వసూలు నిమిత్తం లైన్‌మెన్ రమేశ్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఎమ్మెల్యే ఇంట్లో లేరు. ఎమ్మెల్యే పీఏ అశోక్ రెడ్డి, వేరే వ్యక్తులు ఉన్నారు. విద్యుత్ బిల్లు బకాయి కట్టాలని రమేశ్ కోరాడు. 
 
అయితే ఎమ్మెల్యే ఇంట్లో కార్యకర్తలతో బిజీగా ఉన్నారని, తర్వాత చెల్లిస్తామని అశోక్‌రెడ్డి చెప్పారు. కానీ, తమకు నిబంధనలుంటాయంటూ సదరు ఉద్యోగి కనెక్షన్‌ను కట్‌ చేశారు. దీంతో ఎమ్మెల్యే ఇంటి కనెక్షన్‌నే కట్‌ చేస్తావా? అంటూ రమేశ్‌పై అశోక్‌రెడ్డి చెయ్యి చేసుకున్నాడు.
 
కనెక్షన్‌ తొలగింపుపై విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఒకే నెలకు సంబంధించి రూ.6 వేల బిల్లు మాత్రమే ఉంటే ఎలా కనెక్షన్‌ తొలగిస్తారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ వెంటనే అధికారులు ఎమ్మెల్యే ఇంటి విద్యుత్‌ కనెక్షన్‌ను పునరుద్ధరించారు. అయితే కనెక్షన్‌ తొలగింపుపై ఆగ్రహించిన ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి లైన్‌మన్‌ రమేశ్‌కు ఫోన్‌చేసి దుర్భాషలాడారు. 
 
నా ఇంటికి రారా? అంటూ హెచ్చరించారు. కాగా ఎమ్మెల్యే తిట్లపురాణాన్ని ఆడియో రికార్డు చేసిన విద్యుత్‌ ఉద్యోగి.. దానిని ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియాకు అందించడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. మరోవైపు బాధితుడు రమేశ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అశోక్‌రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చికిత్స కోసం జయను సింగపూర్ తీసుకెళ్లకుండా శశికళ అడ్డుకున్నారా? కొత్త ట్విస్ట్