చికిత్స కోసం జయను సింగపూర్ తీసుకెళ్లకుండా శశికళ అడ్డుకున్నారా? కొత్త ట్విస్ట్
అనారోగ్యం పాలైన జయలలితను మెరుగైన వైద్యసేవలు అందించే నిమిత్తం సింగపూర్ లేదా లండన్‌లకు తీసుకెళ్లకుండా ఆమె ప్రియ నెచ్చెలి శశికళ అడ్డుకున్నారా? జయలలితకు, శశికళకు మధ్య తీవ్రవాదోపవాదాలు జరిగి.. జయలలితను మెట
అనారోగ్యం పాలైన జయలలితను మెరుగైన వైద్యసేవలు అందించే నిమిత్తం సింగపూర్ లేదా లండన్‌లకు తీసుకెళ్లకుండా ఆమె ప్రియ నెచ్చెలి శశికళ అడ్డుకున్నారా? జయలలితకు, శశికళకు మధ్య తీవ్రవాదోపవాదాలు జరిగి.. జయలలితను మెట్లపై నుంచి కిందికి తోసివేశా? ఈ కారణంగానే జయలలిత అపస్మారకస్థితిలోకి జారుకున్నారా? ఇత్యాది ప్రశ్నలకు అవుననే సమాధానం చెపుతోంది తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం వర్గం.
అంతేకాకుండా, జయలలిత అనారోగ్యానికి గురైనప్పుడు ఓ డీఎస్‌పీ అంబులెన్సును రప్పించారని శశికళ వర్గం చెబుతోంది. ఆ డీఎస్సీ ఎవరు? ఆ అంబులెన్సు ఎక్కడ? అంబులెన్సు పోయెస్ గార్డెన్‌లో ఎన్ని గంటలకు బయలుదేరి, ఎన్ని గంటలకు అపోలోకు చేరుకుంది? అపోలో చుట్టూ ఉన్న 27 సీసీ కెమెరాలను హడావుడిగా ఎందుకు తొలగించారు? అని ప్రశ్నించారని ఓపీఎస్ వర్గం పశ్నిస్తోంది.
అలాగే, జయకు శాంతారాం అనే డాక్టర్ చికిత్స అందించేవారని, గత ఏడాది మేలో ఆయన్ని పోయెస్‌గార్డెన్ నుంచి బయటకు వెళ్లగొట్టారన్నారు. జయను అపోలోలో చేర్చేటప్పుడు ఎవరు సంతకం పెట్టారని ఓపీఎస్ టీం నిలదీసింది. జయలలిత మృతిచెందిన రాత్రి ముందుకువరకు ఆస్పత్రిలో జరిగిన డ్రామాపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. వీటన్నింటికీ సమాధానాలను రాబట్టాలంటే జయ మృతిపై న్యాయ విచారణ ఒక్కటే ఏకైక మార్గమన్నారు.
అదేసమయంలో ఒకానొక సందర్భంలో జయలలితకు మెరుగైన వైద్య సేవల నిమిత్తం సింగపూర్ లేదా లండన్‌లకు తరలించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఎయిర్ ఆంబులెన్స్‌ను సైతం సిద్ధం చేశారు. కానీ, చివరి నిమిషంలో వెనక్కితగ్గి.. చెన్నై అపోలో ఆస్పత్రిలోనే చికిత్స చేశారు. ఇలాంటి నిర్ణయం ఎవరిని అడిగి తీసుకున్నారన్నది ఇపుడు ప్రధాన ప్రశ్నగా ఉంది.