వీధి కుక్కల బెడదతో జీహెంచ్ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల అంబర్‌పేట్‌లో బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో.. ప్రజలు విపరీతంగా భయపడుతున్నారు. ఇందు కోసం ప్రజలకు భరోసా ఇవ్వడానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది.
ఈ క్రమంలో 36 గంటల్లో కంట్రోల్ రూం టోల్ ఫ్రీ నెంబర్‌కి ఏకంగా 15 వేల కంప్లైంట్స్ వచ్చాయి. గతంలో రోజుకు 30 వరకు ఫిర్యాదులు వచ్చేవని అధికారులు చెబుతున్నారు. కేవలం హైదరాబాద్‌లోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కలు విజృంభిస్తున్నాయి.
ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామంలో, శుక్రవారం ఉదయం ఇంటి గుమ్మం వద్ద ఆడుకుంటున్న 17 నెలల పాప జర్పుల భానుశ్రీపై వీధి కుక్క దాడి చేయడంతో.. చిన్నారి ఎడమచేయిపై గాయమైంది.