Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జనసేన తెలంగాణ విభాగానికి సంస్థాగత కమిటీలు

Advertiesment
జనసేన తెలంగాణ విభాగానికి సంస్థాగత కమిటీలు
, గురువారం, 5 నవంబరు 2020 (07:02 IST)
తెలంగాణలో జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి రాష్ట్రస్థాయిలో యువజన, విద్యార్ధి, మహిళా విభాగాలను ఏర్పాటు చేయాలని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఇందులో భాగంగా విద్యార్థి, యువజన కమిటీలను నియమించారు.

కమిటీల ఎంపిక బాధ్యతను చేపట్టిన బి.మహేందర్  రెడ్డి (జనసేన ఉపాధ్యక్షులు), ఎన్.శంకర్ గౌడ్ ( జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జి), రామారావు (జనసేన తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ), రామ్ తాళ్ళూరి (జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు) బృందం తమ నివేదికను పవన్ కల్యాణ్ కి అందచేసింది.

హైదరాబాద్ లో వకీల్ సాబ్ షూటింగ్ స్పాట్ లో ఈ బృందం పవన్ కల్యాణ్ తో భేటీ అయింది. వారిచ్చిన నివేదికలను పరిశీలించి విద్యార్థి, యువజన విభాగాల కమిటీలను, సాంస్కృతిక విభాగం కార్యదర్శి నియామకానికి ఆమోదం తెలిపారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 50 డివిజన్లకు కమిటీలను నియమించారు. 
 
జనసేన పార్టీ తెలంగాణ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా టి.సంపత్ నాయక్, ప్రధాన కార్యదర్శిగా  ఎమ్.రామకృష్ణ, యువజన విభాగం అధ్యక్షుడిగా వి.లక్ష్మణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఎస్.కిరణ్ కుమార్, సాంస్కృతిక విభాగం కార్యదర్శిగా దుంపటి శ్రీనివాస్ నియమితులయ్యారు. 
 
జనసేన పార్టీ తెలంగాణ విద్యార్ధి విభాగం కమిటీ వివరాలు ఇవి...
టి. సంపత్ నాయక్      -           ప్రెసిడెంట్ 
జి. రవీందర్ రెడ్డి          -          వైస్ ప్రెసిడెంట్ 
బి. నరేష్                   -          వైస్ ప్రెసిడెంట్ 
ఎమ్. రామకృష్ణ          -         జనరల్ సెక్రటరీ 
కె. పవన్ కుమార్        -        ఆర్గనైజింగ్ సెక్రటరీ 
ఆంజనేయులు గౌడ్     -         ఆర్గనైజింగ్ సెక్రటరీ 
ఆర్. గోపినాథ్ పటేల్    -         సెక్రటరీ 
ఎస్. శరత్ కుమార్      -           సెక్రటరీ 
ఎమ్. కృష్ణ                 -          సెక్రటరీ 
ఇ. విజయ్                -          ఎగ్జిక్యూటివ్ మెంబర్ 
కె. నవీన్                   -          ఎగ్జిక్యూటివ్ మెంబర్ 
దేవరాజ్                    -           ఎగ్జిక్యూటివ్ మెంబర్ 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో జిల్లాల విభజన ప్రక్రియ వేగవంతం!