కరోనావైరస్ కాలంలోనూ ఆన్‌లైన్లో వ్యభిచార దందా నిర్వహిస్తుంది ఓ ముఠా. భౌతిక దూరం పాటించండి కరోనాను కట్టడి చేయండి అంటూ ప్రభుత్వాలు మొర పెట్టుకుంటున్నా ఖాతరు చేయకుండా యుధేచ్చగా వ్యభిచార వ్యాపారం నడుపుతున్నాడు ఓ నిర్వాహకుడు. గుంటూరు జిల్లా చిలకలూరుపేటకు చెందిన వంశీరెడ్డి, చిన్నా, విజయవాడకు చెందిన ఓ మహిళ కలిసి వివిధ రాష్ట్రాల్లో యువతులను సరఫరా చేసే బ్రోకర్ల సహయంతో ఈ చీకటి వ్యాపారం నిర్వహిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన నలుగురు అమ్మాయిలను
దళారులు ద్వారా హైదరాబాద్‌కు రప్పించి బల్కంపేట్‌లో అద్దెకు ఇళ్లు తీసుకుని అందులో ఉంచుతున్నారు ఈ నిర్వాహకులు. సోషల్ మీడియాలో యువతులు ఫోటోలు ఉంచి విటులను ఆకర్షిస్తున్నారు. అమ్మాయి మీకు నచ్చితే ఈ నెంబరు కాల్ చేయండి అంటూ ఒక ఫోన్ నెంబరు ఇస్తున్నారు.
టులు నుంచి ఫోన్ రాగానే మీకు మరలా ఫోన్ చేస్తాం అని చెప్పి, ఫోన్ చేసిన వ్యక్తి వివరాలు పూర్తిగా తెలుసుకుని వీరికి నమ్మకం కుదిరిన తరువాత గూగుల్ పే, పేటీఎం ద్వారా అకౌంట్లో సగం డబ్బులు వేయించుకుంటున్నారు. ఆ తరువాత కోరుకున్న అమ్మాయిలను విటులు కోరిన చోటుకు తీసుకెళ్తారు. ఇది రెగ్యులర్‌గా జరిగే వ్యవహారం. అయితే ఈ దందాపై పోలీసులకు సమాచారం అందడంతో డెకాయిట్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ వ్యభిచార దందా నిర్వహిస్తున్న వ్యక్తులను మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని రాంపల్లికి రప్పించి నలుగురు యువతులను నిర్వహకుడు వంశీరెడ్డిని అరెస్ట్ చేశారు. యువతులను పునరావస కేంద్రాలకు పంపించారు.