సామాన్యుడి జేబులను ఖాళీ చేస్తున్న ఆన్‌లైన్ బుకింగ్ యాప్స్‌పై తెలంగాణ సర్కారు షాక్ ఇచ్చింది. రకరకాల టాక్స్‌లను టిక్కెట్లపై రుద్దుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న ఈ సైట్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
బుక్ మై షో, పేటిఎం,ఈజీ మూవీస్ పేరుతో ఇప్పటికే వివిధ రకాల టాక్స్‌లను సినిమా టిక్కెట్ల రేట్లకు జోడించి సామాన్యుల నుంచి విపరీతంగా దోచేస్తున్నారు. ఇకపై దీనికి చెక్ పెడుతూ ఫిలిం ఫెడరేషన్ కార్పొరేషన్ టిక్కెట్ల అమ్మకాల కోసం ప్రత్యేక వెబ్ సైట్‌ను త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం తీసుకురానుంది.
మరోవైపు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో పద్దులపై చివరి రోజు చర్చ జరుగుతోంది. గవర్నర్, మంత్రి మండలి, సాధారణ పరిపాలనా శాఖ, ఎన్నికల పద్దులపై చర్చించారు. సమాచారం-పౌర సంబంధాలు, శాసనవ్యవస్థ, న్యాయపాలన, ఆర్థిక, నిర్వహణ, ప్రణాళిక, సర్వే, గణాంకాల శాఖల పద్దులపై చర్చిస్తున్నారు. పద్దులను మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలు ప్రవేశపెట్టారు.