Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇలా చేస్తే శ్రీవారి సేవా టిక్కెట్లను సులభంగా పొందొచ్చట..?

Advertiesment
Tirumala
, శనివారం, 7 సెప్టెంబరు 2019 (10:53 IST)
ఇప్పటికే దళారులను ఆశ్రయించి ఎంతోమంది తిరుమల శ్రీవారి భక్తులు మోసపోతున్నారు. అయితే దళారులను నమ్మి మోసపోవద్దని టిటిడి ఎప్పటి నుంచో ప్రకటనలు చేస్తూనే ఉంది. దాంతో పాటు స్వయంగా టిటిడినే ఆన్లైన్‌లో టిక్కెట్లను విడుదల చేస్తూ పారదర్సకంగా భక్తులకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంది.
 
ప్రతి నెల మొదటి శుక్రవారం నేపథ్యంలో జరిగే డయల్ యువర్ ఈ.ఓ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు జరిగిన  కార్యక్రమంలో భక్తుల ప్రశ్నలకు టీటీడీ ఇఓ సింఘాల్ సమాధానాలు ఇస్తూ భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. అలాగే 2019 డిసెంబర్ నెల కోటా ఆర్జిత సేవా టికెట్లను టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. మొత్తం 68,466 టికెట్లను విడుదల చేయగా ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానం కింద 6,516 సేవాటికెట్లను టీటీడీ ఆన్లైన్‌లో ఉంచింది, సుప్రభాతం 3856, తోమాల 60, అర్చన 60, అష్టదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం కోసం 2,300 టికెట్లను విడుదల చేసింది.
 
కరెంటు బుకింగ్‌ కింద మరో 61,950 ఆర్జిత సేవా టికెట్లు విడుదలయ్యాయి. విశేష పూజ 2,500, కల్యాణోత్సవం 13,775, ఊంజల్‌ సేవ 4,350, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,975, వసంతోత్సవం 15,950, సహస్ర దీపాలంకరణ కోసం 17,400 టికెట్లను టిటిడి విడుదల చేసినట్లు టీటీడీ ఇఓ తెలిపారు డయల్ యువర్ ఇఓ కార్యక్రమం తరువాత సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ తిరుమలలోని కొన్నిచోట్ల తాగునీటి సరఫరా సరిగా లేదని భక్తులు కోరారన్నారు. తిరుమలలో వాటర్ సమస్యను సీరియస్‌గా తీసుకుని పరిష్కరిస్తామని తెలిపారు. హుండీ ఆదాయం గత ఏడాది ఏప్రిల్ నుండి ఐదు నెలలలో 450.64 కోట్లు రాగా ఈ ఏడాది 497.29 కోట్లు వచ్చాయన్నారు.
 
అలాగే బంగారం గత ఏడాది ఏప్రిల్ నుండి ఐదు నెలల కాలంలో 344 కేజీలు అందగా ఈ ఏడాది 524 కేజీల బంగారం భక్తులు కానుకలుగా సమర్పించారన్నారు ఇఓ. గత ఏడాది గరుడ సేవరోజు తలెత్తిన లగేజి సమస్య మళ్ళీ ఈసారి తలెత్తకుండా ఉండేందుకు ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఈ సారి బ్రహ్మోత్సవాలలో విజిలెన్స్, పోలీసుల మద్య సమన్వయ లోపం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
 
అన్యమత ఉద్యోగస్తుల వ్యవహారంలో కోర్టు ఆదేశానుసారం ముందుకు వెళతామన్నారు. టైమ్ స్లాట్ టోకన్ల జారీలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నామని వివరణ ఇచ్చారు. మరికొన్ని కీలకనిర్ణయాలు టిటిడి బోర్డు వచ్చాక చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. చాలా ఏళ్ళుగా పేరుకుపోయిన చిల్లర సమస్య తీరిపోయిందని, ఇక చెక్కులు, డిడిలు, ఫారిన్ కరెన్సీ మార్పిడిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నోట్ల రద్దు అనంతరం వచ్చిన 47.5 కోట్ల పాత కరెన్సీ మార్పిడి కోసం చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ఇఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రుడిని ఆలింగనం చేసుకోవటానికి చంద్రయాన్ 2 పరుగు తీసింది... అందుకే: మోదీ