Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో అది ఉందంటూ తప్పుడు సమాచారం.. ఇంజనీరింగ్ విద్యార్థుల అరెస్ట్..

తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో అది ఉందంటూ తప్పుడు సమాచారం.. ఇంజనీరింగ్ విద్యార్థుల అరెస్ట్..
, శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (14:53 IST)
తిరుమలలో చర్చి ఉందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన ముగ్గురు యువకుల్ని అరెస్టు చేశారు పోలీసులు. తిరుమల విజెలెన్స్ ఫిర్యాదు మేరుకు దర్యాప్తు ప్రారంభించన పోలీసులు ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్ధులు నిందితులుగా గుర్తించి రిమాండ్‌కు తరలించారు. 
 
తిరుమలలో చర్చి ఉందని... అన్యమత ప్రచారం జరిగిపోతుందంటూ కొన్నిరోజుల క్రితం ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. గత నెల ఆగస్ట్ 23వ తేదీన ఈ ఫోటోను కొందరు ఉద్దేశపూర్వకంగా పేస్ బుక్, వాట్సప్‌లలో వైరల్ చేయడంతో తిరుమల ప్రతిష్టకు ఇబ్బందిగా మారింది. పలువురు శ్రీవారి భక్తుల మనోభావాలను గాయపరచింది. దీంతో దీనిపైన చర్యలు ప్రారంభించారు టీటీడీ విజెలెన్స్ సిబ్బంది.
 
వైరల్ అయిన ఫోటో చర్చి కాదని కరకంబాడి అటవీ ప్రాంతంలోని ఫారెస్ట్ వాచ్ టవర్‌గా ఆ ప్రదేశానికి వెళ్లి గుర్తించారు. ఆ భవనంపైన ఓ కడ్డీకి అడ్డంగా అమర్చి ఉన్న సీసీ కెమెరాను శిలువగా చిత్రీకరించారని తేల్చారు. దీంతో ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు విజెలెన్స్ సిబ్బంది. దర్యాప్తు ప్రారంభించిన తిరుపతి పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు.
 
సైబర్ నిపుణుల సహకారంతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్ధులు అరుణ్, కార్తీక్‌లతో పాటు గుంటూరుకు చెందిన ఆర్కిటెక్ విద్యార్ధి అజితేష్‌లు నేరం చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. వారిని అరెస్టు చేసి తిరుపతి  అర్బన్ ఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు ఎస్సీ అన్బురాజన్. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారికి సైబర్ చట్టాల ప్రకారం సెక్షన్లు నమోదు చేసి చర్యలు తీసకుంటామన్నారు.
 
ఇతరుల మనోభావాలు కించపరిచేలా అసత్య సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా పెట్టినా.. ఎవరైనా పెట్టిన పోస్టు ఫార్వర్డ్ చేసినా నేరమేనన్నారు ఎస్పీ అన్భురాజన్. ప్రస్తుతం ఈ కేసులో అరెస్టయిన వారు విద్యార్ధులని... చదువుకునే వయసులో ఇలా నేరాలకు పాల్పడి అనవరసరంగా భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని యువకులకు హితువు పలికారు ఎస్సీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్‌ను నడిపించేవాడు కావాలి.. నన్నడిగితే ఆలోచిస్తా: 100 రోజులపై జేసీ పొగడ్తలు