Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దక్షిణ కాశీ పుష్కరిణిలో అభిషేకం.. స్విమ్ చేసిన ఈవో.. నెటిజన్ల ఫైర్

Advertiesment
EO venu
, శనివారం, 27 మే 2023 (13:01 IST)
EO venu
దక్షిణ కాశీగా పేరున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నీలకంఠేశ్వర ఆలయం వార్తల్లో నిలిచింది. నిజామాబాద్‌లోని ఈ ఆలయంలోని పుష్కరిణిలో ఆలయ ఈవో వేణు ఈతకొట్టడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. 
 
నీలకంఠేశ్వర స్వామి విగ్రహాలకు ఆలయ అర్చకులు పుష్కరిణిలో ప్రత్యేక అభిషేకం చేస్తుండగా.. ఆ పక్కనే వేణు ఈత కొడుతూ జలకాలాడారు. అభిషేకం జరుగుతున్న సమయంలో అలా చేయొద్దని అర్చకులు వారించినా ఆయన పట్టించుకోలేదు. 
 
అభిషేకాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా.. దర్జాగా ఈతకొడుతూ స్నానం చేయడం వివాదాస్పదం అవుతోంది. ఇదంతా అక్కడున్న ఓ భక్తుడు తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈవో ప్రవర్తనపై నెటిజన్లు తప్పుబడుతున్నారు. 
 
పుష్కరిణి నీటిని అపవిత్రం చేసి, అపచారానికి పాల్పడిన ఈవోను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో ఫెడరల్ హాలీడేగా దీపావళి.. దివాళి డే యాక్ట్ పేరిట బిల్లు