నిజామాబాద్‌లో పిడికిళ్లతో కొట్టుకున్నారు గ్రామస్థులు. నిజామాబాద్ జిల్లా సాలూర మండలం హున్సా గ్రామంలో హోలీ సందర్భంగా ఏటా ఆనవాయితీగా నిర్వహిస్తున్న పిడిగుద్దులాట యధావిధిగా కొనసాగింది.
ప్రజలు మంగళవారం ఉదయం హోలీ ఆడిన తర్వాత సాయంత్రం హనుమాన్ ఆలయం ఎదురుగా తాడుకు ఇరువైపులా వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించారు. ఐదు నిమిషాల పాటు కొనసాగే ఈ క్రీడ నిర్వహించకపోతే చెడు జరుగుతుంది గ్రామస్థుల నమ్మకం.
ఈ ఘటనలో కొందరు గాయపడ్డారు. అయినా ఆట ముగియగానే పరస్పరం ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అంతకుముందు గ్రామ శివారులో కుస్తీ పోటీలు నిర్వహించారు.