Publish Date: Thu, 07 Oct 2021 (17:59 IST)
Updated Date: Thu, 07 Oct 2021 (18:01 IST)
నిజామాబాద్‌లో ఇటీవల మద్యం మత్తులో జిల్లాలో ఓ మహిళపై ఇద్దరు మృగాళ్లు అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారు. ఈ ఘటన మరవకముందే తాజాగా మరో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పెయింటర్స్ కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది.
ఇద్దరు మైనర్ బాలికపై వసీం అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. చాక్లెట్ ఆశ చూపి బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టాడు. గత నెల రోజులుగా బాలికలపై వసీం దారుణానికి పాల్పడుతున్నాడు.
చికిత్స నిమిత్తం అమ్మాయిలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లితండ్రుల పిర్యాదు తో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అంతేకాకుండా నింధితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.