మోడీ నాగుపాములను పెంచుతున్నారు: అసదుద్దీన్‌ ఓవైసీ

మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (08:16 IST)
ప్రధాని మోడీ నాగుపాములను పెంచుతున్నారని, ఏదో ఒకరోజు మిమ్మల్ని కాటేస్తాయని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ పేర్కొన్నారు.

ఢిల్లి ఘటనపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ స్పందించారు.  ట్రంప్‌ పర్యటన సమయంలో ఢిల్లిలో అల్లర్లు చాలా సిగ్గుచేటని అసదుద్దీన్‌ ఓవైసీ పేర్కొన్నారు. ఢిల్లిలో జరిగిన హింస ఘటనపై చింతిస్తున్నానన్నారు.

రతన్‌లాల్‌, ఫుర్‌ఖాన్‌ చనిపోవడం బాధాకరమన్నారు. ఆందోళనకారులతో కలిసి ఢిల్లి పోలీసులు రాళ్లు విసురుతున్నారన్నారు.

ఢిల్లిలో శాంతియుత వాతావరణం కల్పించాలని ప్రధాని, హోంశాఖ మంత్రిని కోరుతున్నానన్నారు. ఎన్‌పీఆర్‌పై స్టే తీసుకురావాలని మరోసారి కేసీఆర్‌ను కలుస్తామన్నారు. స్టే తీసుకురావడంలో టీఎస్‌ హోంమంత్రి సహకరించాలన్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 70వ రోజుకి రాజధాని రైతుల ఆందోళన