తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ ఓల్డ్ సిటీ పరిధిలోని చాదర్‌ఘాట్ కమలానగర్ ప్రాంతానికి ఓ హిందూ దళిత బాలికపై స్థానిక ఎమ్మెల్యే నేత షకీల్ కన్నేశాడు. లాక్‌డౌన్ సమయంలో ఆ యువతి ఇల్లువదిలి రోడ్డుపైకి వచ్చింది.
ఇదే అదునుగా భావించిన ఎంఐఎం నేత ఆ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి షకీల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు
మరోవైపు, ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ, పాతబస్తీలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. షకీల్‌కు ఎంఐఎం అండగా ఉందని ఆరోపించారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఇదిలావుంటే, బాధితురాలిని ఎంఐఎం ఎమ్మెల్యే బలాలా పరామర్శించారు. అయితే, ఎమ్మెల్యే బలాల బాధితురాలు ఇంటికి చేరుకున్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేశారు. ఎమ్మెల్యే గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
దీనిపై బలాలా మాట్లాడుతూ, నిందితుడికి పార్టీతో సంబంధం లేదని చెప్పారు. ఫొటోలు పెట్టుకున్న వారంతా అనుచరులు కాదని అన్నారు. ప్రధాని మోడీ ఫొటోను విజయ్ మాల్యా పెట్టుకున్నారని... అంత మాత్రాన మోడీని విమర్శిస్తే ఎలాగని ప్రశ్నించారు. అయితే, స్థానికుల నిరసలు మిన్నంటడంతో ఆయన వెనక్కి వెళ్ళిపోయారు.