Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ కాలేజీలో 500 మంది గంజాయి దమ్ము గాళ్లేనట... అది కాలేజా లేక గంజాయి కొట్టా?

విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల నుంచి సరఫరా అయిన గంజాయిని హైదరాబాద్ కాలేజీలల్లో పోరగాళ్లు ఇప్పుడు కూడా విచ్చలవిడిగా దమ్మురూపంలో లాగించేస్తున్నారని మీడియా పరిశీలనలో తేలిపోయింది. విశ్వనగరంలోని కాలేజీల్లో దమ్ మారో దమ్ అంటూ పాటలు వినబడవు కానీ దమ్ము లాగే పో

Advertiesment
ఆ కాలేజీలో 500 మంది గంజాయి దమ్ము గాళ్లేనట... అది కాలేజా లేక గంజాయి కొట్టా?
హైదరాబాద్ , శనివారం, 8 జులై 2017 (07:32 IST)
విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల నుంచి సరఫరా అయిన గంజాయిని హైదరాబాద్ కాలేజీలల్లో పోరగాళ్లు ఇప్పుడు కూడా విచ్చలవిడిగా దమ్మురూపంలో లాగించేస్తున్నారని మీడియా పరిశీలనలో తేలిపోయింది. విశ్వనగరంలోని కాలేజీల్లో దమ్ మారో దమ్ అంటూ పాటలు వినబడవు కానీ దమ్ము లాగే పోకిరీలు మాత్రం వందల్లోనే కనిపిస్తున్నారంటే హైదరాబాద్‌ను ఇక విశ్వనగరం, స్వచ్ఛ నగరం అనే పేర్లతో పిలవడం వెంటనే మానివేయాల్సి ఉంది. నగరం నడిబొడ్డులో కొత్వాల్ కార్యాలయానికి కూతవేటు దూరంలోని ఒక చారిత్రక విద్యాసంస్థలో కనీసం 500 మంది విద్యార్థులు దమ్ము గొట్టడంలో మునిగి తేలడం మీడియా ప్రతినిధి కళ్లారా చూసి దిగ్బ్రాంతి చెందాడంటే ఇతర కాలేజీల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 
 
ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా స్వయం ప్రతిపత్తితో కొనసాగుతున్న ఈ కళాశాలలో ప్రభుత్వం, ఇటు తల్లిదండ్రులు కూడా గజగజ వణకాల్సిన స్థాయిలో గంజాయి, ఎల్‌ఎస్‌డీ, డీవోబీ వంటి డ్రగ్స్‌ను ఊదిపడేస్తున్నారని ఆ కాలేజీ సిబ్బంది, సెక్యూరిటీ, వాచ్ మన్ వంటివారే చెబుతున్నారు. ఆ కాలేజీ చుట్టూ బడ్డీకొట్లు, ఇతర దుకాణాల్లోనూ లభిస్తున్న ఓసీబీ స్లిప్స్‌‌ను గంజాయి పీల్చడానికే ప్రధానంగా వాడతారన్నది జగమెరిగిన సత్యమే. రాజధానితోపాటు శివారు ప్రాంతాల్లో విద్యా ర్థులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, స్టార్‌ హోటళ్లకు డ్రగ్స్‌ రవాణా జరుగుతోందని ఎక్సైజ్‌ దర్యాప్తులో బయటపడటంతో అప్రమత్తంగా ఉండాలని కమిషనర్లు, ఎస్పీలను డీజీపీ అనురాగ్‌శర్మ ఆదేశించారు.
 
హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ఉన్న ఈ కాలేజీలో వివిధ కోర్సుల్లో కలిపి దాదాపు 4,500 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. అందులో సుమారు 1,500 మంది విదేశీ విద్యార్థులుండగా.. వీరిలో ఎక్కువగా ఆఫ్రికా దేశాలవారే. అత్యుత్తమ ఫలితాలతో విద్యార్థులను ఆకర్షించిన కళాశాల అది.. ఎందరో ఉన్నతస్థాయి వ్యక్తులను సమాజానికి అందించింది కూడా.. కానీ ఇప్పుడా కళాశాల మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారింది. భిన్న సంస్కృతుల వారితో కలసిన విద్యార్థులు, స్వేచ్ఛాయుత వాతావరణం, మాదక ద్రవ్యాలు అందుబాటులో ఉండడంతో విద్యార్థులు పెడదోవ పడుతున్నారు. హైదరాబాద్‌లో ఇటీవల సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో తొలుత పట్టుబడిన విద్యార్థి ఇదే కాలేజీకి చెందినవారు కావడం గమనార్హం. బీబీఏ కోర్సు చదువుతున్న ఆ సోమాలియా విద్యార్థిని ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేసి, రాబట్టిన సమాచారంతోనే కూపీ లాగి కెల్విన్, వాహిద్‌ గ్యాంగులను పట్టుకున్నారు.
 
ఎక్సైజ్‌ నేర పరిశోధక విభాగంలో పట్టున్న ఒక అధికారి సహకారంతో మీడియా ప్రతినిధి ఆ కళాశాల ప్రాంతానికి వెళ్లగా.. గంజాయితో సిగరెట్లు చేసుకుని తాగుతున్న విద్యార్థుల బృందాలు కనిపించాయి. కాలేజీ ఆవరణలో, ఓ ఇంటి మెట్ల మీద, విద్యార్థులు ఉండే గదుల్లో గుంపులుగా చేరి గంజాయి తాగుతున్న విద్యార్థులు కనిపించారు. ఇక ఆ కాలేజీ క్యాంపస్‌లో పనిచేసే తోటమాలి, సెక్యూరిటీ సిబ్బంది, ఇతర ఉద్యోగులను కదిలిస్తే ‘డ్రగ్స్‌’ సంగతులెన్నో పూసగుచ్చుతున్నారు. కళాశాల సమీపంలోని బడ్డీ కొట్లు, పాన్‌షాపులు, చెరుకు రసం బండ్ల మీద గంజాయి, విదేశీ డ్రగ్స్‌ అమ్ముతుంటారని వెల్లడించారు.
 
విద్యార్థులతోపాటు ఇతర రంగాలకు చెందిన వారిని కలుపుకొంటే హైదరాబాద్‌ నగరంలో రోజుకు 250 కిలోలకుపైగా గంజాయి వినియోగమవుతోందని వెల్లడిస్తున్నారు. ధూల్‌పేటలో గుడుంబాను అరికట్టిన తర్వాత ఊహించని విధంగా గంజాయి వాడకం పెరిగిందని ఎక్సైజ్‌ అధికారి ఒకరు చెప్పారు. విద్యార్థులు, ఆర్థికంగా ఎదిగిన వర్గాలు గ్రీన్‌ గంజాయికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని.. 10 గ్రాముల గంజాయి డిమాండ్‌ను బట్టి రూ.700 నుంచి రూ.1,000 వరకు విక్రయిస్తున్నారని సమాచారం. హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా పలు కాలేజీల్లో కలిపి సుమారు మూడు వేల మంది విద్యార్థులు డ్రగ్స్, గంజాయికి బానిసైనట్లు ఎక్సైజ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
ఈ గంజాయి దమ్ముగాళ్ల వ్యవహారం చూస్తుంటే దేవుడా రక్షించు నా దేశాన్ని అంటూ 60 ఏళ్ల క్రితం తిలక్ రాసిన సుప్రసిద్ధ గీతం గుర్తుకొస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త అక్రమ సంబంధం.. బట్టలూడదీసి చెప్పుతో కొట్టింది. పాడుబుద్ధి మానలా