Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్త అక్రమ సంబంధం.. బట్టలూడదీసి చెప్పుతో కొట్టింది. పాడుబుద్ధి మానలా

ఇది మరే దేశంలోనో జరిగిన ఘటన కాదు. సాక్షాత్తూ భారత్‌లోనే జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త బిడ్డలు పుట్టాక మరొకామెతో సంబందం పెట్టుకుని ఇంటి ముఖం చూడకపోగా విడాకులు నోటీసు పంపి మరీ కోర్టుకీడ్చితే అంతవరకు సహనం పాటించిన ఆ భార్య అపర కాళికగా మారిపోయ

Advertiesment
భర్త అక్రమ సంబంధం.. బట్టలూడదీసి చెప్పుతో కొట్టింది. పాడుబుద్ధి మానలా
హైదరాబాద్ , శనివారం, 8 జులై 2017 (06:15 IST)
ఇది మరే దేశంలోనో జరిగిన ఘటన కాదు. సాక్షాత్తూ భారత్‌లోనే జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త బిడ్డలు పుట్టాక మరొకామెతో సంబందం పెట్టుకుని ఇంటి ముఖం చూడకపోగా విడాకులు నోటీసు పంపి మరీ కోర్టుకీడ్చితే అంతవరకు సహనం పాటించిన ఆ భార్య అపర కాళికగా మారిపోయింి. కోర్టులోనే తన భర్తకు బట్టలూడదీసి మరీ చెప్పులతో బాదిపడేసింది. చూస్తున్న జనం, లాయర్లు, కోర్టు సిబ్బంది వారిని బయటకు పంపి అక్కడ మళ్లీ ఆ భర్తగాడికి మరో రెండు తగిలించారు. అప్పటికీ బుద్ధి రాని అతగాడు కుటుంబంతో కలిసి హత్యాయత్నం చేసిందని కేసు పెట్టాడు.
 
వివరాల్లోకి వెళితే. అహమ్మదాబాద్‌‌కి చెందిన అతగాడు ఒక మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలకు తల్లిని చేసిన తర్వాత మొహం చాటేశాడు. మరో యువతిని ప్రేమ ముగ్గులోకి దింపి, అక్రమ సంబంధం నెరుపుతూ.. ఇంటి పట్టుకు రావడం పూర్తిగా మానేశాడు. ప్రియురాలితో మరో పెళ్లికి సిద్ధమైన ఆ ప్రబుద్ధుడు.. తన భార్య నుంచి విడాకులు కోరుతూ నోటీసు పంపించి, కోర్టుకీడ్చాడు. 
 
కోర్టు ప్రాంగణంలో ఆ అమర ప్రేమికుణ్ని చూడగానే అతడి భార్య శివాలెత్తిపోయింది. అతడి బట్టలూడదీసి చెప్పులు తెగేదాకా కొట్టింది. ఆ మహిళకు తన తల్లి, సోదరీ కూడా తోడవ్వడంతో.. ఆ వ్యక్తికి బడితె పూజ బాగా జరిగింది. జనమంతా విస్తుపోయి చూసిన ఈ సన్నివేశం అహ్మదాబాద్ ఫ్యామిలీ కోర్టు ప్రాంగణంలో చోటు చేసుకుంది. యువతి తన రక్త సంబంధీకులతో కలసి భర్తను విపరీతంగా కొడతుండటం చూసిన కొంత మంది లాయర్లు వాళ్లను వారించారు. 
 
కోర్టు సిబ్బంది వచ్చి, వారిని ఆ ప్రాంగణం నుంచి బయటికి పంపించారు. కోర్టు బయటికి వచ్చిన తర్వాత మనోడికి మరో రౌండు తగిలించారు. దీంతో అతడు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన జరుగుతున్నప్పుడు అక్కడ జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు. తొలుత ఆ వ్యక్తిపై జాలి చూపించిన కొంత మంది అసలు విషయం తెలుసుకున్నాక మరో నాలుగు తగిలించండని సలహా ఇచ్చారు. 
 
ఆ తర్వాత మరో యువతిని పెళ్లి చేసుకుంటూ విడాకులు పంపించాడని ఆమె.. కుటుంబంతో కలిసి హత్యాయత్నం చేసిందని అతడు.. ఒకరిపై మరొకరు కేసు పెట్టుకున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుఖం కోసం వచ్చాడు.. చూసి వలచాడు... బయటకు లాగాడు.. మంచిదే కానీ...