Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వికారాబాద్‌లో మహిళ కిడ్నాప్... మాజీ భర్తపై అనుమానం?

Advertiesment
Vikarabad
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్‌లో మహిళ కిడ్నాప్‌కు గురైంది. మరో మహిళతో కలిసి రోడ్డుపై నడిచి వెళుతుండగా కొందరు దుండగులు వచ్చిన ఈ మహిళను బలవంతంగా కిడ్నాప్ చేశారు. ఇది స్థానికంగా కలకలం రేపింది. 
 
ఈ కిడ్నాప్‌పై స్థానిక పోలీసులకు సమాచారం అదించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, ప్రత్యేక టీమ్‌లు కిడ్నాపైన మహిళ కోసం వెతుకులాట ప్రారంభించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, దీపిక అనే మహిళ మరో మహిళతో కలిసి రోడ్డుపై నడుస్తూ వెళుతుండగా, గుర్తు తెలియని దుండగులు కొందరు దీపికను బలవంతంగా కిడ్నాప్ చేశారు. ఈ యువతి గత నాలుగేళ్ళ క్రితం అఖిల్ అనే యువకుడిని ప్రేమ పెళ్ళి చేసుకుంది. ఆ తర్వాత అతనికి దూరమైంది. సో.. అతనే కిడ్నాప్ చేసివుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
కాగా, ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అందుబాటులో ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ నీ పరిశీలిస్తున్నారు. దుండగులు అనంతగిరి వైపు వెళ్లి ఉంటారని భావించి, ఆ వైపు రెస్క్యూ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు ఇంటికి వరద ముప్పు నోటీసు... ఖాళీ చేయాలంటూ హెచ్చరికలు