Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మ్యాట్రిమొనీతో పరిచయం... పెళ్లాడుతానని లొంగదీసుకుని రూ.27 లక్షలు లాగేశాడు...

మంచి కుటుంబం నుంచి అబ్బాయి, అమ్మాయిలను పెళ్లాడాలని అంతా అనుకుంటారు. ఇదివరకు పెళ్లిళ్ల పేరయ్య అంటూ మధ్యవర్తులు వుండేవారు. ఏ కుటుంబంలో అమ్మాయి, అబ్బాయి పెళ్లికి రెడీగా వున్నారో చూసి చెపుతుండేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అందుకే మ్యాట్రిమొనీ కంపెనీ

Advertiesment
మ్యాట్రిమొనీతో పరిచయం... పెళ్లాడుతానని లొంగదీసుకుని రూ.27 లక్షలు లాగేశాడు...
, బుధవారం, 13 డిశెంబరు 2017 (13:47 IST)
మంచి కుటుంబం నుంచి అబ్బాయి, అమ్మాయిలను పెళ్లాడాలని అంతా అనుకుంటారు. ఇదివరకు పెళ్లిళ్ల పేరయ్య అంటూ మధ్యవర్తులు వుండేవారు. ఏ కుటుంబంలో అమ్మాయి, అబ్బాయి పెళ్లికి రెడీగా వున్నారో చూసి చెపుతుండేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అందుకే మ్యాట్రిమొనీ కంపెనీలు పుట్టుకొచ్చాయి. అమ్మాయి, అబ్బాయి బయోడేటాను సదరు మ్యాట్రిమొనీ సైట్లలో పెడితే... నచ్చినవారు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడిదే కొందరిని మోసం చేసే వేదిక కూడా మారుతోంది. తాజాగా సైబరాబాద్ పరిధిలో ఓ యువకుడు ఓ యువతిని పెళ్లాడుతానని లొంగదీసుకుని ఆమె నుంచి రూ. 27 లక్షల డబ్బు కూడా కొట్టేశాడు. 
 
వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు హైదరాబాదులో పనిచేస్తున్న ఓ యువతికి మ్యాట్రిమొనీ ద్వారా పరిచయమయ్యాడు. తను పేరున్న కంపెనీలో పనిచేస్తున్నట్లు నమ్మించాడు. అలా ఆమెతో పరిచయం పెంచుకుని, పెళ్లాడుతానని చెప్పి లొంగదీసుకున్నాడు. 
 
ఆ తర్వాత తనకు బ్యాంకు అవసరాలు వున్నాయంటూ రూ. 27 లక్షలు ఆమెతో బ్యాంక్ లోన్ తీయించి మరీ లాగేశాడు. బ్యాంకులో డబ్బు కట్టాలని ఎన్నిసార్లు అడిగినా అతడి నుంచి స్పందన లేకపోగా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీనితో సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాస్ ను అరెస్టు చేసి దర్యాప్తు చేయగా ఇలా మరికొంతమందిని ఏమార్చినట్లు తేలింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామసేతు మానవ నిర్మితమే.. ఆ రాళ్లకు ఏడువేల సంవత్సరాలు (వీడియో)