Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్తుల గొడవ.. మొదటి భార్యను చంపేసిన భర్త.. మటన్ కత్తితో..?

ఆస్తుల గొడవ.. మొదటి భార్యను చంపేసిన భర్త.. మటన్ కత్తితో..?
, మంగళవారం, 4 మే 2021 (15:40 IST)
భార్యాభర్తల అనుబంధాలు కనుమరుగై ప్రస్తుతం హత్యలు పెరిగిపోతున్నాయి. క్షణికావేశాలతో కుటుంబ కలహాలకు హత్యకు ఒడిగడుతున్నారు. అంతేగాకుండా మహిళలపై హింసలు, అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ భర్త తన భార్యను మటన్ కత్తితో హతమార్చాడు. 
 
ఈ విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం లీలా గ్రామంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. మొదటి భార్యను కడతేర్చిన భర్త నేరుగా రెంజల్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. 
 
ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పిలోల దావుజీ ఇతను వృత్తి రిత్యా మటన్ షాప్ నడుపుతూ జీవిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు మొదటి భార్య మల్లు బాయ్(45) ఇద్దరు కుమారులు. అదేవిధంగా దావూజీ రెండవభార్య విజయ కు ఇద్దరు కుమార్తెలు. అందరు కలిసి ఒకే ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. ఆరు మాసాల క్రితం విజయ కూతురుకు పెళ్లి జరిపించారు.
 
పెళ్లి కోసం ఇంటిని అమ్మి వేయడంతో మొదటి భార్య ఇతని పై ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్న కుమారుడు మానసిక వికలాంగులు కావడంతో అతనికి ఆస్తి ఉండాలని భర్తతో తరుచుగా గొడవ పడేది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో మొదటి భార్య పై కక్ష పెంచుకున్న దావుజీ ఆమె నిద్రిస్తున్న సమయంలో దాదాపు ఒంటి గంట ప్రాంతంలో మేడపై కత్తితో నరికి హత్య చేశాడు.
 
నేరుగా రెంజల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఈ సంఘటన పై హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు దావు జీ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మల్లు బాయ్ మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ని మార్చురీకి తరలించారు. సంఘటన నీలా గ్రామంలో విషాదాన్ని నింపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్డౌన్ విధించండి.. కేంద్రంపై ఒత్తిడి.. 24 గంటల్లో భారీగా కేసులు