ఎన్టీఆర్ జిల్లా గుడివాడ సమీపంలో ఓ వ్యక్తి పీకల వరకు మద్యం సేవించాడు. ఆ తర్వాత బైకుపై షికారుకెళ్లాడు. బందరు రోడ్డుపై చక్కర్లు కొడుతూ హడావుడి చేశాడు. ఈ క్రమంలో అతను పోలీసుల కంట పడ్డాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు బ్రీత్ అనలైజర్‌తో పరీక్ష చేశాడు. ఇందులో ఏకంగా 530 పాయింట్లు చూపించడంతో పోలీసులే షాక్ అయ్యారు. ఇది 15కు పైగా బీర్లు తాగితేనే ఈ తరహా పాయింట్లు చూపిస్తుందని పెనమలూరు సీఐ గోవిందరాజు తెలిపారు.
సదరు తాగుబోతు పేరును పోలీసులు వెల్లడించలేదు కానీ ఆయన మాత్రం గుడివాడ సమీపంలోని వెంట్రప్రగడకు చెందిన వ్యక్తి అని చెప్పారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో పీకల వరకు మద్యం సేవించి బైకుపై షికారుకు వెళ్లాడు. ఆపై బందరు రోడ్డుపై కాసేపు హడావుడి చేసి పోలీసులకు చిక్కాడు.
పూర్తి మద్యం మత్తులో ఉన్న అతడికి బ్రీత్ అనలైజర్ పరీక్షని సీఐ నిర్వహించారు. ఇందులో రీడింగ్ పర్సంటేజ్ చూసి పోలీసులు విస్తుపోయారు. ఏకంగా 530 పాయింట్లు చూపించడంతో షాకయ్యారు. 15కు పైగా బీర్లు తాగితే తప్ప అంత రీడింగ్ రాదని సీఐ వెల్లడించారు. దీంతో అతని వాహనాన్ని సీజ్ చేసి సభ్యులకు సమాచారం అందించినట్టు తెలిపారు.
దీనిపై సీఐ గోవిందరాజు మాట్లాడుతూ, తమకు చిక్కడంతో ప్రాణాలతో బయటపడ్డాడని, లేకుంటే ప్రమాదం జరిగివుండేదని తెలిపారు. కాగా, అతనిలాగా మద్యం తాగి వాహనాలు నడిపిన వారిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.