Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గణేష్ నిమజ్జనం వేడుకలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

heart stroke
, గురువారం, 28 సెప్టెంబరు 2023 (14:41 IST)
ఇటీవలి కాలంలో తరచూ ఎక్కడో ఒకచోట అకస్మాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం పాతకారాయిగూడెంలో గుండెపోటుతో వ్యక్తి కుప్పకూలి మరణించాడు. గురువారం నాడు గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో దూదిపాళ్ల సత్యనారాయణ అనే వ్యక్తి ఉత్సాహంగా పాల్గొన్నాడు. తప్పెట్ల మోతెక్కిపోతుండగా వారి ముందర నాట్యం చేయడం ప్రారంభించాడు. ఇలా చేస్తూనే అకస్మాత్తుగా కిందపడిపోయాడు. అతడి పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఐతే మార్గమధ్యంలో అతడు ప్రాణాలు విడిచాడు.
 
గుండెను గుల్లచేసే చెడు కొలెస్ట్రాల్ వదిలించుకునేదెలా?
గుండెను గుల్లచేసే వాటిలో చెడు కొలెస్ట్రాల్ ఒకటి. అలాగే అధిక రక్తపోటు, సరైన వ్యాయామం, క్రమబద్దమైన ఆహారం తీసుకోకకపోవడం కూడా గుండె సమస్యలకు కారణమవుతాయి. గుండె అనారోగ్యానికి కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్ పెరిగితే దానిని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాము. చెడు కొలెస్ట్రాల్‌ను పెంచే ఫాస్ట్ ఫుడ్స్, ఇతర మాంసాహారాన్ని తినడం మానేయాలి.
 
రోజూ ఆపిల్, సిట్రస్ పండ్లను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కూడా తొలగిపోతుంది. పెరుగు తీసుకోవాలి, ఐతే పెరుగును తక్కువ మోతాదులో తినాలి. మొలకలు రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి కాబట్టి వాటిని తినడం ప్రారంభించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం లేదా యోగా చేయాలి, సైక్లింగ్ లేదా నడక కూడా చేయవచ్చు.
 
కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వెల్లుల్లి కూడా ఉపయోగపడుతుంది. ఏదైనా పండు, కూరగాయలు మొదలైన వాటిలో రాక్ సాల్ట్ మిక్స్ చేసి తినాలి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే మెంతి నీరు కూడా తీసుకోవచ్చు. ఉదయం ఉసిరికాయ లేదా కలబంద రసం త్రాగవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐఫోన్-15 లోపాలు: ఛార్జింగ్ పెడితే వేడి.. పట్టుకోలేకపోతున్నారట..!