భారత మార్కెట్లోకి విడుదలైన ఐ-ఫోన్ 15లో ఇప్పటికే లోపాలు తలెత్తాయి. ఈ ఫోన్ ఛార్జింగ్ విషయంలో లోపాలు తలెత్తాయి. చార్జింగ్ పెట్టినా, కాసేపు మాట్లాడినా లేదా గేమ్ ఆడినా కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు.
ఐఫోన్ వేడెక్కడానికి కారణాలపై యాపిల్ సంస్థ పేర్కొంది. ఇంటెన్సివ్ యాప్‌లను వాడుతున్నపుడు, చార్జింగ్ పెట్టినపుడు, ఫస్ట్ టైం సెట్టింగ్ చేస్తున్నపుడు ఈ సమస్య ఎదురవుతుందని సంస్థ వెల్లడించింది.
యాపిల్ కంపెనీ ఏటా ఆర్జించే ఆదాయంలో సగం వాటా ఐఫోన్లదేననే సంగతి తెలిసిందే. అందుకే ఐఫోన్ కొత్త సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేటపుడు సంస్థ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుందని ఐటీ నిపుణులు అంటున్నారు.