Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పక్కా సాంకేతిక దర్యాప్తుతో శిరీష కేసు తేల్చేశారు.. కానీ న్యాయం జరిగేనా?

హైదరాబాద్‌లో మేకప్ ఆర్టిస్ట్ శిరీష ఆత్మహత్య కేసులో పోలీసులు పక్కా సమచారం ప్రాతిపదికన విచారణ సాగించారు. దీని ప్రకారం, శిరీష వ్యవహారంలో సోమవారం రాత్రి 8 నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2 వరకు 90 గంటల వ్యవధిలో

Advertiesment
Make-up artist Sirisha
హైదరాబాద్ , శనివారం, 17 జూన్ 2017 (03:12 IST)
హైదరాబాద్‌లో మేకప్ ఆర్టిస్ట్ శిరీష ఆత్మహత్య కేసులో పోలీసులు పక్కా సమచారం ప్రాతిపదికన విచారణ సాగించారు. దీని ప్రకారం, శిరీష వ్యవహారంలో సోమవారం రాత్రి 8 నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2 వరకు 90 గంటల వ్యవధిలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ 90 గంటల్లోనే శిరీష–రాజీవ్‌ –తేజస్విని మధ్య నెలకొన్న వివాదం మరోసారి ఠాణాకు వెళ్ళడం, పరిష్కారం కోసం శ్రవణ్‌.. కుకునూర్‌పల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి వద్దకు తీసుకువెళ్ళడం, అక్కడ ఆమెపై జరిగిన అత్యాచారయత్నం, తిరిగి వచ్చాక ఆత్మహత్య, నిందితుల అరెస్టు జరిగాయి. ఈ మధ్యలోనే కుకునూర్‌పల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య మరో ట్విస్ట్‌.
 
శిరీష స్టూడియోలోని తన గదిలో ఉరివేసుకున్న ఘటనను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు కావడంతో పోలీసులు ఫోరెన్సిక్‌ డాక్టర్‌ వేణుగోపాల్‌ నేతృత్వంలో మరో మహిళా డాక్టర్‌తో కూడిన బృందంతో పోస్టుమార్టం చేయించారు.  వైద్యులు ఆత్మహత్యగా తేల్చినా.. తదుపరి దర్యాప్తు నిమిత్తం కడుపు నుంచి సేకరించిన విస్రా, సున్నితావయవం నుంచి తీసిన వెజైనా నమూనాలు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పారు. అనుమానాస్పద మృతిగా నమోదైన కేసును ఆత్మహత్యకు ప్రేరేపించడంగా మార్చిన పోలీసులు రాజీవ్, శ్రవణ్‌లను అరెస్టు చేశారు.
 
ఈ కేసును పోలీసులు పక్కా సాకేంతికంగా దర్యాప్తు చేశారు. సెల్‌ లోకేషన్స్‌ ఆధారంగా శిరీష, శ్రవణ్, రాజీవ్, ఎస్‌సై ప్రభాకర్‌రెడ్డి నలుగురూ సోమవారం రాత్రి 11.32 నుంచి మంగళవారం తెల్లవారుజాము 1.59 గంటల వరకు కుకునూర్‌పల్లిలోనే ఉన్నట్లు నిర్థారించారు. మరోపక్క శిరీష, శ్రవణ్, రాజీవ్‌ మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటలకు కుకునూర్‌పల్లి నుంచి స్టూడియో వద్దకు చేరుకున్నారు. 
 
ఈ స్టూడియోలోకి వెళ్ళిరావడానికి బయోమెట్రిక్‌ పరిజ్ఞానంతో పనిచేసే ఎంట్రీలు ఉన్నాయి. వీటి ఆధారంగా 3.45 నుంచి 4.20 వరకు రాజీవ్, శిరీష ఎప్పుడెప్పుడు వెళ్ళివచ్చారో నిర్థారించారు. శ్రవణ్‌కు బయోమెట్రిక్‌ అవకాశం లేకపోవడంతో రాజీవ్‌ వెంటే వెళ్ళి వచ్చాడు. ఈ వివరాలన్నింటిని పూస గుచ్చినట్లు పేర్చిన పోలీసులు ఆమె ఆత్మహత్య ఘటనలో నేర కోణం దాగిం ఉందిని నిర్ధారించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 
 
కాని అసలు విషయం ఒక జీవితాన్ని బలితీసుకున్న ఆ దుర్మార్గులకు శిక్ష పడేనా.. పోలీసు ఆధారాలు కోర్టులో ఏమేరకు నిలబడతాయన్నదే అసలు ప్రశ్న.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూలై 1 నుంచి బాలామృతం పంపిణీ చేస్తాం... మంత్రి పరిటాల సునీత