తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్‌ను జూన్ 30వ తేదీ వరకు పొడగించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. లాక్డౌన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సి.ఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులతో చర్చించారు.
కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం సూచించిన సడలింపులను అమలు చేయాలని నిర్ణయించారు. కంటైన్మెంట్ జోన్లలో కట్టుదిట్టంగా లాక్డౌన్‌ను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాత్రి పూట కర్ఫ్యూ కూడా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేయాలని ఆదేశించారు. షాపులను రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరచి ఉంచాలని కోరారు. ఇతర రాష్ట్రాల రాకపోకలు కూడా ఎలాంటి నియంత్రణ అవసరం లేదని చెప్పారు