ప్రపంచ పర్యాటకకేంద్రమైన నాగార్జునకొండకు బుధవారం నుంచి లాంచీలు నడపనున్నారు. కరోనా నేపథ్యంలో రెండునెలల క్రితం కేంద్రపురావస్తుశాఖ దేశంలోని అన్ని మ్యూజియంలు, పురాతన కట్టడాలను మూసివేయాలని ఆదేశాలు జారీచేసింది.
పర్యాటక కేంద్రాలైన నాగార్జునకొండ, అనుపు ప్రాంతాలకు పర్యాటకులను అనుమతించలేదు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కేంద్ర పురావస్తుశాఖ అనుమతులతో నాగార్జునకొండ, అనుపు ప్రాంతాలను పర్యాటకులు సందర్శించేందుకు అనుమతి వచ్చినట్లు పురావస్తుశాఖ కన్జర్వేటివ్ అసిస్టెంట్ వెంకటయ్య తెలిపారు.
రాష్ట్రప్రభుత్వం ఈనెల 20వరకు లాక్‌డౌన్ విధించడంతో పర్యాటకులు కొన్ని రోజులు వేచి ఉండక తప్పదు.