Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా కట్టడిలో కెటియార్

Advertiesment
కరోనా కట్టడిలో కెటియార్
, బుధవారం, 25 మార్చి 2020 (20:48 IST)
కరోనా కట్టడికి ప్రజాప్రతినిధులు సైతం రంగంలో దిగి భాద్యత తీసుకోవాలన్న ముఖ్యమంత్రి అదేశాల మేరకు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు హైదరాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ ప్రకటించిన తరువాత హైదరాబాద్ లో వున్న పరిస్థితులను స్వయంగా పర్యటించి తెలుసుకున్నారు.

దీంతోపాటు నిత్యావసర సరుకుల కోసం అమోజాన్, ప్లిప్ కార్ట్ , గ్రోఫర్స్స్, బిగ్ బాస్కెట్ వంటి వాటి సేవలను ఉపయోగించుకునేలా, వారి సిబ్బందిని లాక్ డౌన్ సందర్భంగా నియంత్రించకుండా చూడాలని తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డిని కోరారు. వారి సరుకుల పంపీణీ కార్యకలాపాలు పున: ప్రారంభం అయ్యేలా చూడాలన్నారు.

నగరంలో పెద్ద ఎత్తున కొనసాగుతున్న భవన నిర్మాణాలు, ఇతర మౌళిక వసతులు పనుల్లో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికుల యోగక్షేమాలు, వసతులుపైన తర్వరలోనే భవన నిర్మాణ సంఘాలతో ఒక సమావేశం ఎర్పాటు చేస్తానని, అప్పటిదాకా వారికి వసతికి, అహారానికి ఇబ్బందులు లేకుండా చూడాలని కెటియార్ విజ్ఝప్తి చేశారు.

ప్రస్తుతం నగరంలోని హస్టళ్లను మూసివేస్తుండడంతో వస్తున్న ఇబ్బందులపైన తగిన చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కూమార్, నగర మేయర్ బొంతు రామ్మెహాన్ లకు సూచించారు. నగరంలోని హస్టళ్ల యాజమాన్యాలతో మాట్లాడి అందులో ఉంటున్న వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని అదేశించారు. 
 
ప్రగతి భవన్ నుండి బుద్ధభవన్‌కూ వెళ్తుండగా, దారిలో రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తున్న కార్మికులను పలుకరించారు. వారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన కార్మికులు, ప్రస్తుతం వారు ఉంటున్న ఉప్పల్ వరకు వెళ్ళడానికి తన సిబ్బందికి చెప్పి ఒక వాహనాన్ని ఏర్పాటు చేశారు. 

అదేవిధంగా అక్కడే కనిపించిన బీహార్ కు చెందిన ఓ కార్మికుడు, తాను అనాథను అని, తనకు చూసుకోవడానికి ఎవరూ లేరని మంత్రికి చెప్పిన వెంటనే,  జీ.హెచ్.ఎం.సి నైట్ షెల్టెర్‌లో అతనికి బస ఏర్పాటు చేయాలనీ,  జీహెచ్.ఎం.సి అదనపు కమిషనర్ శంకరయ్యను ఆదేశించారు.    

తరువాత బుద్ధ భవన్‌లో ఉన్న విపత్తు నిర్వహణ కార్యాలయాన్ని సందర్శించారు. హైదరాబాద్ మహానగరంలో డిజాస్టర్ రెస్పాన్స్ టీములు కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలపైన డైరెక్టర్ ఎంఫోర్స్మెంట్ & డిజాస్టర్ మెనెజ్మెంట్ విశ్వజీత్ ను అడిగి తెలుసుకున్నారు.  అక్కడే కంట్రోల్ రూమ్ లో వున్న సిబ్బందిని వారి రోజువారీ పని గురించి వాకబు చేశారు. తర్వాతా జీ.హెచ్.ఎం.సి కేంద్ర కార్యాలయంలో వున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ ను కూడా మంత్రి సందర్శించారు. 

వివిధ సమస్యలపైన కంట్రోల్ రూంకు వస్తున్న ఫిర్యాదుల గురించి కమీషనర్, జీ.హెచ్.ఎం.సి మరియు కలెక్టర్ హైదరాబాద్ లను అడిగితెలుసుకున్నారు. ఈ సెంటర్ లో వున్న సిబ్బందికి మంత్రి వివిధ సూచనలను చేసారు. వివిధ సమస్యలపైన వచ్చే కాల్స్ ను మానవతా దృక్పథం తో త్వరిత గతిన స్పందించాలని సూచించారు. అవసరం అయితే ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. 

గోల్నాకాలో వున్న జీ.హెచ్.ఎం.సి నైట్ షెల్టర్ ను సైతం మంత్రి సందర్శించారు. అక్కడ ఉన్నవారికి అందుబాటులో ఉన్న వసతులను అడిగి తెలుసుకున్నారు. నైట్ షెల్టర్ లో వున్న అర్హులైన ఒంటరి మహిళలు, వితంతువులు, మరియు వికలాంగులకు ఆసరా పెన్షన్లు వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మొహంతిను ఆదేశించారు.

అక్కడ పక్కనే ఉన్న కాలనీలో పర్యటించి కాలనీలోని ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మరియు ఇంటిలోనుండి ఎవరు బయటకు రావద్దని, ఎవరూ భయపడవద్దని, ప్రభుత్వం అందరికి అండగా ఉంటుందని చెప్పారు.

డిజాస్టర్ రెస్పాన్స్ టీంలు నిరంతరం చేపడుతున్న క్రిమిసమ్హారక స్ప్రే కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ఎర్రగడ్డలో పర్యవేక్షించారు. గౌరవ మంత్రి కెటియార్తో నగర మేయర్ బొంతు రామ్మోహాన్, విశ్వజీత్, డైరెక్టర్ ఎంఫోర్స్మెంట్ ఎండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఇందులో పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్యాంక్​ లోన్​ ఈఎంఐ ఆలస్యమైందా?