Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగిత్యాల పట్టణంలో కింగ్‌ఫిషర్ బీర్లు అమ్మడం లేదు.. కలెక్టర్‌కు ఫిర్యాదు

beer
, సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (15:46 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల పట్టణంలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదని ఓ మద్యంబాబు ఆరోపిస్తున్నాడు. జగిత్యాల పట్టణంలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదని కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ జగిత్యాల ప్రజావాణిలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లతకు బీరం రాజేష్ అనే వ్యక్తి వినతి పత్రం సమర్పించాడు. 
 
ఈ వినతి పత్రంలో ఆయన పేర్కొన్న విషయాలను పరిశీలిస్తే, "అయ్యా... నేను భీరం రాజేశ్ తండ్రిపేరు శంకరయ్య. జగిత్యాల నివాసిని. జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వం అనుమతి పొందిన మద్యం విక్రయ దుకాణాల్లో (వైన్స్, బార్లు)లలో కేఎఫ్ (కింగ్‌ఫిషర్) అనే కంపెనీకి చెందిన బీర్లు అమ్మడం లేదు. అనుమతి పొందిన సమయంలో అన్ని రకాల మద్యం బ్రాండ్లను అందుబాటులో ఉంచుతామని అనుమతి పొంది తర్వాత నాణ్యతలేని బీర్లు అమ్మకాలు చేస్తునన్నారు. వీటి ద్వారా ప్రజలు ఆరోగ్యం పాడైపోడవడమే కాకుండా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. 
 
అన్ని రకాల బీర్లు అమ్మాల్సిన దుకాణదారులు కేవలం కొన్ని నాణ్యతలేని బీర్లు అమ్మడం ద్వారా యువకులు మద్యపానం చేసి వారు 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం వెళ్లి వాటిని కొనుగోలు చేసి తిరిగి వచ్చే క్రమంలో ప్రమాదానికి గురికావడం జరుగుతుంది. లేదా బెల్టు షాపులలో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ వైన్స్ బార్లలో దొరకని కేఎఫ్ బీర్లు బెల్టు దుకాణంలో ఎక్కడివి? అవి నిజమైన బీర్లేనా? లేక కృత్రిమంగా బెల్టు షాపుల యజమానులు తయారు చేస్తున్నారా? 
 
అయితే, దుకాణం దారులు వారికి ఇష్టం వచ్చిన మద్యం మాత్రమే అమ్ముకునే హక్కు వారికి ఎవరు ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన వ్యాపారులు మాత్రమే మద్యం విక్రయాలు సాగించాల్సివుందని హుకుం జారీ చేసిన అధికారులు...  ప్రభుత్వానికి ఆదాయంలో నష్టం వచ్చే కార్యక్రమం జరుగుతున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. జగిత్యాల పట్టణంలో అన్ని రకాల బీర్లు అమ్మే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి అని భీరం రాజేష్ ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా నాన్న ఆరోగ్యం సీరియస్‌గా ఉంది... ఎంపీ ధర్మపురి అరవింద్