Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన హ్యుందామ్‌ మోటర్‌ ఇండియా ఫౌండేషన్‌

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన హ్యుందామ్‌ మోటర్‌ ఇండియా ఫౌండేషన్‌
, శనివారం, 25 డిశెంబరు 2021 (16:12 IST)
హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన సీఎస్‌ఆర్‌ విభాగం హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా ఫౌండేషన్‌ (హెచ్‌ఎంఐఎఫ్‌) నేడు నిమిషానికి 50 లీటర్ల (ఎల్‌పీఎం) సామర్థ్యం కలిగిన ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ను తెలంగాణా రాష్ట్రం, ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించింది.
 
ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్‌ సూపరిండెంట్‌ శ్రీ ఉపేంద్ర జాదవ్‌ తో పాటుగా హెచ్‌ఎంఐఎల్‌ అధికారులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్లాంట్‌ ద్వారా ఆసుపత్రిలోని దాదాపు 50 ఐసీయు పడకల ఆక్సిజన్‌ అవసరాలు తీరనున్నాయి. అంతేకాదు, దాదాపు ఒక లక్ష మంది రోగులకు సైతం ఇది  సహాయపడనుంది. కోవిడ్‌ –19 రోగులతో పాటుగా ఇతర సంబంధిత వైద్య సమస్యలు కలిగిన  రోగులకు ఆక్సిజన్‌ అవసరాలను తీర్చడం ద్వారా తగిన చికిత్స నందించేందుకు ఈ మెడికల్‌ ఆక్సిజన్‌ తోడ్పడుతుంది.
 
ఆక్సిజన్‌ ప్లాంట్‌ ప్రారంభం సందర్భంగా శ్రీ ఎస్‌ఎస్‌ కిమ్‌, ఎండీ అండ్‌ సీఈవొ- హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా లిమిటెడ్‌ మాట్లాడుతూ, ‘‘ప్రస్తుత మహమ్మారి ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొవాల్సిన ఆవశ్యకతను వెల్లడించింది. మా అంతర్జాతీయ లక్ష్యం ‘మానవత్వం కోసం అభివృద్ధి’ ద్వారా, ఆరోగ్య మౌలికవసతులను బలోపేతం చేయడం కోసం వైద్య సిబ్బంది మరియు కమ్యూనిటీకి మద్దతునందిస్తున్నాం.


తీవ్ర అనారోగ్యం బారిన రోగుల ప్రాణాలను కాపాడేందుకు ఆక్సిజన్‌ను నిరంతరం సరఫరా చేయడం అవసరం. అందువల్ల మేము ఈ సదుపాయాన్ని ఆసుపత్రిలో ఏర్పాటుచేయడం ద్వారా భవిష్యత్‌ డిమాండ్‌ను సైతం తీర్చనున్నాం’’అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒమిక్రాన్ టెన్షన్: నేటి రాత్రి నుంచి కర్ఫ్యూ.. ఎక్కడంటే?