Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యువతి వెంటపడిన ట్రాఫిక్ పోలీసులు.. ఎందుకు.. ఎక్కడ..?

హైదరాబాద్ హైటెక్ సిటీలో మగవారి కన్నా ఆడవారే ఎక్కువగా మద్యం సేవిస్తున్నట్లున్నారట. అది కూడా పట్టపగలే ఫుల్‌గా మద్యం సేవించి మరీ యువతులు వాహనాలను నడిపేస్తున్నారు. ఇక రాత్రి వేళల్లో అయితే అస్సలు చెప్పాల్స

యువతి వెంటపడిన ట్రాఫిక్ పోలీసులు.. ఎందుకు.. ఎక్కడ..?
, బుధవారం, 17 జనవరి 2018 (15:56 IST)
హైదరాబాద్ హైటెక్ సిటీలో మగవారి కన్నా ఆడవారే ఎక్కువగా మద్యం సేవిస్తున్నట్లున్నారట. అది కూడా పట్టపగలే ఫుల్‌గా మద్యం సేవించి మరీ యువతులు వాహనాలను నడిపేస్తున్నారు. ఇక రాత్రి వేళల్లో అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. మోతాదుకు మించి తాగడమే కాకుండా ఇష్టం వచ్చినట్లు వాహనాలను రోడ్లపైన రయ్‌మని దూసుకెళుతున్నారు. గత కొన్నిరోజులకు ముందు ఏకంగా ఒక టాప్ యాంకర్ పట్టుబడి చివరకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత ఎలాగోలా ఆ కేసు నుంచి బయటపడి కౌన్సిలింగ్ తీసుకొన్నారు ఆ యాంకర్.
 
ఆ తర్వాతి నుంచి హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ను పక్కాగా నిర్వహించేస్తున్నారు. మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్‌లో ఒక యువతి ఫ్లూటుగా మద్యం సేవించి ఎంచక్కా కారు నడుపుకుంటూ వెళుతోంది. ట్రాఫిక్ పోలీసులు కారును ఆపినా ఆపలేదు. కొంతదూరం వెళ్ళాక కారు ఆపింది. మేడం.. బ్రీత్ ఎనలైజింగ్ చేయాలి.. గాలి ఊదండి అంటూ మిషన్‌ను పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నించగా ఏయ్.. ఎవరనుకున్నావు.. నన్నే చెక్ చేస్తారా అంటూ కారు డోర్‌ను గట్టిగా తోసి మెల్లగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళింది. అరకిలోమీటర్ వరకు నడుచుకుంటూనే ఆ యువతి రోడ్డంతా తిరిగింది. 
 
ఆ యువతి వెంట ట్రాఫిక్ పోలీసులు పడ్డారు. చివరకు ఆ యువతి వెనక్కి తగ్గి బ్రీత్ ఎనలైజింగ్ చేయించుకుంది. మోతాదుకు మించి మద్యం సేవించడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమె కారును స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఒక ప్రైవేట్ ఐటీ కంపెనీలో ఆ యువతి పనిచేస్తున్నట్లుగా ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ఆ సీట్లు నాకొదిలేయ్.. ప్రధాని మాటలతో బాబు షాక్