Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పబ్లిక్‌ టాయ్‌లెట్‌ సదుపాయాలలో హైదరాబాద్‌ లూ అదుర్స్

Advertiesment
పబ్లిక్‌ టాయ్‌లెట్‌ సదుపాయాలలో హైదరాబాద్‌ లూ అదుర్స్
, సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (21:08 IST)
అత్యాధునిక పబ్లిక్‌ టాయ్‌లెట్‌, అర్బన్‌ లూను సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వెలుపల 28 ఫిబ్రవరి 2022న ప్రారంభించారు. దీనిని తెలంగాణా రాష్ట్ర మత్స్య శాఖామాత్యులు శ్రీ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గౌరవనీయ సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎంఎల్‌ఏ శ్రీ జి.సాయన్న, హైదరాబాద్‌ నగర మేయర్‌ శ్రీమతి గద్వాల్‌ విజయలక్ష్మి, ఈ ఏరియా కార్పోరేటర్‌ శ్రీమతి కొణతం దీపిక పాల్గొన్నారు.

 
టాయ్‌లెట్స్‌ అండ్‌ టాయ్‌లెట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్మించి, నిర్వహించనున్న అర్బన్‌ లూ యొక్క ప్రధాన లక్ష్యం, పబ్లిక్‌ టాయ్‌లెట్లను వినియోగించడంలో సామాన్య మానవుని అనుభవాలను మెరుగుపరచడం. సాధారణంగా, భారతదేశంలో పబ్లిక్‌ టాయ్‌లెట్లు మురికి కూపాలుగా ఉండటంతో పాటుగా సరిగా నిర్వహించకపోవడం, అనారోగ్యకరంగా, వినియోగించతగని రీతిలో ఉంటాయి. ఈ సమస్యలకు తగిన పరిష్కారాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన మూత్రశాలల నిర్మాణం ద్వారా పూరించాలన్నది అర్బన్‌ లూ ప్రయత్నం. ఇది అతి తక్కువగా వనరులను వినియోగించుకోవడంతో పాటుగా మహిళలకు సురక్షితంగానూ ఉంటుంది. వినియోగదారులందరికీ చక్కటి అనుభవాలనూ అందిస్తుంది.

 
టాయ్‌లెట్స్‌ అండ్‌ టాయ్‌లెట్స్‌ డైరెక్టర్‌ కుముద్‌ రంజన్‌ మాట్లాడుతూ, ‘‘అభివృద్ధి చెందుతున్న ఆధునిక స్మార్ట్‌ సిటీస్‌లో అతి ముఖ్యమైన ల్యాండ్‌మార్క్స్‌లో ఒకటిగా పబ్లిక్‌ టాయ్‌లెట్స్‌ నిలుస్తుంటాయి. మనమేమిటి? మరియు మనం మన నగరాన్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నామనేదాని గురించి పుంఖానుపుంఖాలుగా ఇది చెబుతుంది. పబ్లిక్‌ టాయ్‌లెట్ల పట్ల ఉన్న భావనలను మార్చాలన్నది మా లక్ష్యం. చక్కటి సదుపాయాలు ఉంటే, టాయ్‌లెట్లను శుభ్రంగా ఉంచేందుకు ప్రజలు కూడా ఆసక్తి చూపుతారు.

 
దీర్ఘకాలంలో అది వారి ప్రవర్తనలోనూ మార్పును తీసుకువస్తుంది. మేము పూర్తి అభిరుచితో ఈ టాయ్‌లెట్లను నిర్మించాము. అందువల్ల వినియోగదారులంతా అత్యాధునిక సదుపాయాలను ఆత్మగౌరవం, సౌకర్యంతో వినియోగించుకోవచ్చు. మహిళలు మరీ ముఖ్యంగా పిల్లల అవసరాలను సైతం చూసుకోవాల్సిన బాధ్యత కలిగిన  మహిళల అవసరాలు తీర్చడంపై ప్రత్యేక శ్రద్ధ కనిబరిచాము. ఈ మూత్రశాలల నిర్వహణకు మేము కట్టుబడి ఉండటంతో పాటుగా ఈ సదుపాయాలు పరిశుభ్రంగా ఉంచేందుకు వినియోగదారులు తగిన తోడ్పాటునందించగలరనే విశ్వాసంతో ఉన్నాము’’ అని అన్నారు.

 
ఆయనే మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ అధికారుల మద్దతు, సహకారం లేకుండా ఇది అసలు సాధ్యమయ్యేదే కాదు. వారు పూర్తి సహకారం తమకు అందించారు. తెలంగాణా ప్రభుత్వ నగరాభివృద్ధి, పురపాలిక పరిపాలన, జీహెచ్‌ఎంసీల యొక్క స్ఫూర్తిదాయక లక్ష్యం తమకు స్ఫూర్తి కలిగింగించదన్నారు.

 
అధిక సంఖ్యలో ప్రజల అవసరాలను ఈ టాయ్‌లెట్లు తీర్చగలవు. దీని సన్నటి ప్రవేశ ద్వారం సమృద్ధిగా సహజ కాంతి   కలిగి ఉందని నిర్థారించడంతో పాటుగా సమర్థవంతంగా విద్యుత్‌ను వినియోగించుకుంటుందనే భరోసానూ అందిస్తుంది. చెడు వాసనలు రాకుండా క్రాస్‌ వెంటిలేషన్‌ సదుపాయాలు సైతం దీనిలో ఉన్నాయి. మహిళల విభాగంలో శానిటరీ న్యాప్కిన్‌ డిస్పెన్సర్‌ మరియు బేబీ ఛేంజింగ్‌ ప్రాంగణం కూడా ఉంటుంది. ఈ టాయ్‌లెట్లలో వాటర్‌లెస్‌/ఓడర్‌లెస్‌ యూరినల్స్‌ మరియు షవర్‌ సదుపాయాలు సైతం ఉన్నాయి. భద్రతా ప్రమాణాలు అందుకునేందుకు, ఈ టాయ్‌లెట్‌ను అత్యున్నత నాణ్యత కలిగిన మెటీరియల్స్‌ అయినటువంటి తెలంగాణాలోని స్లేట్‌ స్టోన్‌ వినియోగించారు. ఈ టాయ్‌లెట్‌ ఫ్లోరింగ్‌ జారదు. టాయ్‌లెట్‌ బయట క్లాక్‌ టవర్‌ ఉంటుంది. దీనిని దూరం నుంచి కూడా చూడవచ్చు. రాత్రి పూట ప్రకాశించే రీతిలో దీనిని తీర్చిదిద్దారు. ఎప్పుడూ జనసందోహం ఉండే అతి ముఖ్యమైన ల్యాండ్‌మార్క్‌గా దీనిని రూపకల్పన చేశారు.

 
ఈ ప్రాజెక్ట్‌కు కల్పిత్‌ అషర్‌ మరియు మయూరీ సిసోడియాలు ప్రారంభించిన ఆర్కిటెక్చర్‌ అండ్‌ అర్బన్‌ డిజైన్‌ సంస్ధ ‘మ్యాడ్‌ (ఈ) ఇన్‌ ముంబై’ డిజైన్‌ చేసింది. ప్రజల కోసం పర్యావరణ అనుకూలమైన నిర్మాణాలను రూపొందించడంలో  ఆర్కిటెక్ట్‌లు మరియు  పట్టణ  నిపుణులు ఎలాంటి పాత్ర ను  పోషించగలరో అర్బన్‌ లూ చూపుతుంది. ఇది నగర అందాలనూ పెంచుతుంది’’ అని  అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం జగన్ పైన సినిమా తీస్తే బొమ్మ 1000 రోజులు ఆడుతుంది, ఎవరు?