Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అదనపు కట్నం తీసుకురాలేదని అశ్లీల చిత్రాలను చూపించిన భర్త, భరించలేని భార్య?

Advertiesment
అదనపు కట్నం తీసుకురాలేదని అశ్లీల చిత్రాలను చూపించిన భర్త, భరించలేని భార్య?
, బుధవారం, 8 జులై 2020 (20:52 IST)
అదనపు కట్నం కోసం ఒక వివాహిత బలైంది. పెళ్ళయి 5 నెలలే అయితే అడినంత కట్నం ఇవ్వలేదని అత్తమామలు వేధించడంతో తట్టుకోలేకపోయింది. భర్త కూడా అత్తమామలకు వత్తాసు పలకడంతో ఏమీ చేయలేక పుట్టింటికి వచ్చేసింది.
 
పుట్టింటికి వచ్చినా సరే భర్త వాట్సాప్‌లలో బెడ్రూమ్ వీడియోలు పంపడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాల జిల్లా ధర్మపురం మండలంలోని బతికపల్లి గ్రామానికి చెందిన అంజిరెడ్డి, శోభారాణి దంపతుల చిన్న కుమార్తె దివ్య హైదరాబాద్ లోని ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తోంది.
 
అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ రెడ్డితో ఫిబ్రవరి 22వ తేదీన వివాహమైంది. వివాహం సమయంలో 20 లక్షల కట్నం, 20 తులాల బంగారం, ఎకరం భూమి ఇచ్చారు. పెళ్లయిన తరువాత హైదరాబాద్‌లోనే కాపురం పెట్టారు.
 
అయితే కట్నం మరింత కావాలంటూ పెళ్ళయిన వారం రోజుల నుంచే అత్తమామల వేధింపులు ప్రారంభమయ్యాయి. దీంతో వేధింపులు తట్టుకోలేక ఇంటి నుంచి పుట్టింటికి మార్చి నెలలో వచ్చేసింది దివ్య. కట్నం ఇవ్వకుండా ఇంటికి రావద్దని అత్త, మామలు ఫోన్ చేశారు.
 
నాలుగునెలల నుంచి కట్నం తీసుకురాకుండా ఉండటంతో భార్య ప్రవీణ్ రెడ్డికి కోపమొచ్చింది. దీంతో అశ్లీలమైన వీడియోలను దివ్య వాట్సాప్‌కు పంపేవాడు. భర్త అలా చేయడంతో భార్య షాకైంది. తీవ్ర మనస్థాపానికి గురైంది. తల్లిదండ్రులకు తన బాధ చెప్పుకోలేక స్థానికంగా ఉన్న పొలంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది దివ్య. పోలీసులు విచారణలో అస్సలు విషయం బయటకు రావడంతో భర్త, అత్త, మామలను అరెస్టు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేరం వేరు.. పాపం వేరు - అచ్చెన్న కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు