Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పార్కులో ప్రియుడితో భార్య... భర్తకు అడ్డంగా చిక్కింది...

Advertiesment
పార్కులో ప్రియుడితో భార్య... భర్తకు అడ్డంగా చిక్కింది...
, శనివారం, 4 మే 2019 (19:32 IST)
ఆమెది ప్రేమ వివాహం.. ప్రేమించినవాడినే పెళ్లాడింది. బంగారం లాంటి కాపురం. అందంగా.. ఆనందంగా సాగుతుంది వారి దాంపత్య జీవితం. కోరుకున్న భర్త.. రత్నాల్లాంటి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. భర్తపై మోజు తీరిందో ఏమో ప్రియుడి మోజులో పడింది. భార్య ప్రవర్తనపై అనుమానం కలిగి నిఘా పెట్టిన భర్తకు అడ్డంగా దొరికిపోయింది. ప్రియుడితో పార్కులో మురిపాల్లో మునిగితేలుతున్న భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఆమె ప్రియుడిని పోలీసులకు అప్పగించాడు. 
 
హైదరాబాద్ బల్కంపేట్‌కు చెందిన మహేష్ ఎస్.ఆర్.నగర్‌లో ఓ స్సా సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. గతంలో మహేష్ సీసీ కెమెరాల వ్యాపారం చేసేటప్పుడు సీసీ కెమెరాల టెక్నీషియన్ చంద్రశేఖర్ పరిచయమయ్యాడు. ఆ పరిచయంతో మహేష్ ఇంటికి తరచూ చంద్రశేఖర్ వస్తుండేవాడు. దీంతో మహేష్ భార్యతో ఏర్పడిన పరిచయం కాస్తా కొన్నాళ్లకు వారి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
పిల్లలిద్దరికి వేసవి సెలవులు కావడంతో ఇంట్లోనే ఉండటంతో ప్రియుడ్ని పిలిపించుకుని బైక్ పైన బయల్దేరింది. అదే సమయంలో ఇంటికొస్తున్న మహేష్ తన భార్య మరొకరితో బైక్ పైన వెళ్లడాన్ని గమనించి వారిని బైక్ పైన వెంబడించాడు. నెక్లెస్ రోడ్డులోని పార్కులో ప్రియుడి ఒళ్లో మురిపాల్లో మునిగితేలుతున్న భార్యను చూసి నివ్వెరపోయాడు. వెంటనే తన సెల్ ఫోన్ కెమెరాలో వీరిద్దరినీ రికార్డు చేస్తుండగా ఇది గమనించిన భార్య... తన భర్తకు ఎదురుతిరిగింది.
webdunia
 
ఇంతలో ఆమె ప్రియుడు చంద్రశేఖర్ పారిపోతుండగా పట్టుకుని పోలీసులకు అప్పగించాడు బాధితుడు. తన రాసలీలల్ని భర్త బయటపెట్టాడన్న కోపంతో పిల్లలిద్దర్ని విచక్షణారహితంగా కొట్టి గాయపర్చింది. తన వివాహేతర సంబంధం బయటపడటంతో భర్తపై అదనపు వరకట్నం తెమ్మంటూ వేధింపులకు గురిచేస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రంప్‌తో చర్చలు విఫలం... మళ్లీ ఉత్తర కొరియా అధినేత కిమ్ క్షిపణి పరీక్ష