Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రైవేట్ ఆసుపత్రుల ధనదాహం, కరోనా అనుమానంతో ఆసుపత్రికి వెళితే కాలు తీసి పంపించేశారు...

ప్రైవేట్ ఆసుపత్రుల ధనదాహం, కరోనా అనుమానంతో ఆసుపత్రికి వెళితే కాలు తీసి పంపించేశారు...
, శనివారం, 12 సెప్టెంబరు 2020 (12:50 IST)
ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల ధన దాహానికి ఓ మనిషి కాలు తొలగించడంతో ఆయన జీవితం బుగ్గిపాలు అయింది. ఆసుపత్రికి నడుచుకుంటూ వెళ్లిన వ్యక్తి మళ్లీ తిరిగి వికలాంగుడిగా అయిన దృశ్యం చూస్తుంటే కలవరపరుస్తోంది. ఇది ఎక్కడో కాదు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గిరిప్రసాద్ నగర్ కాలనీలో.
 
కాలనీకి చెందిన ఏస్ కె. మీరా వయసు 62 సంవత్సరాలు. అతనికి ఎలాంటి వ్యాధి లేకున్నా కరోనా లక్షణాల అనుమానంతో అనారోగ్యంగా ఉందంటూ నగర శివారులో లోతుకుంటలో ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరగా కరోనా ఉందంటూ నాలుగు సార్లు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. ఐతే అతడు ఎడమ కాలు బాగా నొప్పిగా ఉంది అనడంతో ఏకంగా కాలును తొలగించారు.
 
దీనితో ఎస్ కె. మీరా వికలాంగుడిగా మారడంతో ఆ కుటుంబం రోడ్డు పాలయింది. అంతేకాదు.. అక్షరాల ఆసుపత్రిలో ఆరు లక్షల రూపాయల బిల్లులు చెల్లించారు. దీనితో ఆ కుటుంబం అప్పుల ఊబిలోకి నెట్టివేయబడింది. తనను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశారు. ఈమధ్య కాలంలో ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులలో ఎలాంటి నైపుణ్యం లేని డాక్టర్లను పెట్టి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
 
లక్షల రూపాయలతో ఫీజులు దండుకుంటున్నా, ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. తనలా ఏ ఒక వ్యక్తికి అన్యాయం జరగవద్దని అంటున్నాడు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి పేద ప్రజల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాల్మన్ ఫిష్‌లోనూ కరోనా వైరస్ క్రిములు.. 9 రోజులు జీవించి ఉంటాయట..