సినీ లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
క్యాస్టింగ్ కౌచ్ పేరిట సినీమా ఇండ్రస్ట్రీలో లైంగిక వేధింపుల ఆరోపణలు పెరుగుతున్న నేపధ్యంలో విచారణకు హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని పలు మహిళా సంఘాల నాయకులు, హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాయి. ఈ పిల్ పైన మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు సినీ
క్యాస్టింగ్ కౌచ్ పేరిట సినీమా ఇండ్రస్ట్రీలో లైంగిక వేధింపుల ఆరోపణలు పెరుగుతున్న నేపధ్యంలో విచారణకు హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని పలు మహిళా సంఘాల నాయకులు, హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాయి. ఈ పిల్ పైన మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు–దోపిడీలకు సంబంధించి చట్టంలో వచ్చిన మార్పుల గురించి, వాటి అమలు తీరు గురించి తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
లైంగిక వేధింపుల నివారణకు చట్టాలు ఏం చెబుతున్నాయో.. వాటి అమలుకు ప్రభుత్వం తీసుకునే చర్యలేమిటో తెలియజేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో న్యాయ సేవాధికార సంస్థ సేవల్ని వినియోగించుకోవాలని హోం శాఖను ఆదేశించింది హైకోర్టు. లైంగిక దోపిడీ వ్యవహారంలో మహిళా కమిషన్ ఏం చేస్తుందని హైకోర్టు ప్రశ్నించింది.