Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సోమ్‌నాథ్ చటర్జీకి అంత్యక్రియలు చేయడం లేదు.. ఎందుకో తెలుసా?

సీపీఎం కురువృద్ధుడు, లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ (89) అనారోగ్యం కారణంగా సోమవారం కన్నుమూశారు. ఆయన మృతిపట్ల పార్లమెంట్ ఉభయసభలతో పాటు దేశంలోని పలువురు అగ్రనేతలంగా తీవ్ర తమ ప్రగాఢ సానుభూతిని, సం

సోమ్‌నాథ్ చటర్జీకి అంత్యక్రియలు చేయడం లేదు.. ఎందుకో తెలుసా?
, సోమవారం, 13 ఆగస్టు 2018 (16:46 IST)
సీపీఎం కురువృద్ధుడు, లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ (89) అనారోగ్యం కారణంగా సోమవారం కన్నుమూశారు. ఆయన మృతిపట్ల పార్లమెంట్ ఉభయసభలతో పాటు దేశంలోని పలువురు అగ్రనేతలంగా తీవ్ర తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తంచేశారు.
 
అయితే, సోమ్‌నాథ్ అంత్యక్రియలను మాత్రం నిర్వహించడం లేదు. ఎందుకో తెలుసా? నిజానికి ఈయన అంత్యక్రియలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భావించింది. కానీ, సోమ్‌నాథ్ జీవించివుండగా రాసిపెట్టిన వీలునామా మాత్రం అందుకు ససేమిరా అంటోంది. 
 
అణువణువూ కమ్యూనిజం భావజాలంతో నిండిపోయిన ఈ సీనియర్‌ నేత... తన మరణాంతరం భౌతికకాయాన్ని పరిశోధనలకు ఉపయోగపడేవిధంగా ఏదైనా మెడికల్‌ కాలేజీకి విరాళంగా ఇవ్వాలని 2002లోనే కోరారు. ఈ మేరకు ఆయన ఓ వీలునామా కూడా రాసిపెట్టారు. దీంతో ఆయన కోరుకున్న విధంగా పార్థీవదేహాన్ని స్థానిక ఎస్‌ఎస్‌కేఎమ్‌ ఆస్పత్రికి అప్పగించనున్నారు. 
 
అయితే, ఆయన భౌతికకాయాన్ని ఆస్పత్రికి అప్పగించేముందు ఆయన పార్థివదేహాన్ని కోల్‍కతా హైకోర్టు ప్రాంగణంలో ఉంచనున్నారు. ఎందుకంటే ఈయన ఇక్కడ లీగల్ న్యాయవాదిగా పని చేశారు. పైగా కోల్‌కతా హైకోర్టుతో ఆయనకు ఎంతో అనుభవం ఉంది. 
 
దీంతో అయన పార్థీవదేహాన్ని గౌరవార్థం హైకోర్టుకు తరలిస్తారు. అక్కడి నుంచి కోల్‌కతా అసెంబ్లీలో కాసేపు ఉంచి.. పోలీసుల వందన అనంతరం మెడికల్‌ కాలేజీకి తరలిస్తారని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తెలిపారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు సోమ్‌నాథ్‌ చటర్జీ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డీఎంకే సభ్యుడుని కాదు... ఆ పార్టీ గురించి నన్ను అడగొద్దు : అళగిరి