Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైక్లాస్ లేడిస్.. పేకాట ఆడుతూ దొరికిపోయారు..

Advertiesment
High class
హైక్లాస్ లేడిస్ మందు తాగుతారు. పేకాట ఆడుతారని వినివుంటాం. అయితే ఇక్కడ పేకాట ఆడే హైక్లాస్ లేడీస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌లో పేకటస్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు.

జూబ్లీహిల్స్‌ వెంకటగిరిలోని ఓ ఇంట్లో పలువురు ప్రముఖులు పేకాట ఆడుతున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ఇంటిపై దాడి చేసి వివిధ రంగాలకు చెందిన 11 మంది వ్యాపార ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు.
 
వీరంతా సంపన్న కుటుంబాలకు చెందిన డాక్టర్లు, న్యాయవాదులుగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వీరి నుంచి సెల్‌ఫోన్లతోపాటు 3 లక్షల 45 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌ వెంకటగిరిలో ఓ ఇంట్లో గుట్టుగా ఈ వ్యవహరం ఎప్పటి నుంచో నడుస్తున్నట్లు తెలుస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్ ఎఫెక్ట్... ఏపీలో పెరిగిన డేటా వినియోగం!