హైదరాబాద్‌లో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇంతలో అర్ధరాత్రి దాటిన తర్వాత మళ్లీ వర్షం కురిసింది.
కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, మాదాపూర్, గచ్చిబౌలి, బోరబండ, ఫిలింనగర్, బంజారాహిల్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
భారీ వర్షంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు మంగళవారం కూడా నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా పిడుగులు పడే అవకాశం వున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.