Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వినూత్న ఇంప్లాంట్‌తో 74 ఏళ్ల రోగికి హార్ట్‌ వాల్వ్‌ మార్పిడి: విరించి హాస్పిటల్స్‌

Advertiesment
వినూత్న ఇంప్లాంట్‌తో 74 ఏళ్ల రోగికి హార్ట్‌ వాల్వ్‌ మార్పిడి: విరించి హాస్పిటల్స్‌
, గురువారం, 29 అక్టోబరు 2020 (08:17 IST)
తీవ్రమైన అరోటిక్‌ వాల్వ్‌ స్టెనోసిస్‌తో బాధపడుతున్న వికారాబాద్‌కు చెందిన 74 సంవత్సరాల ఎస్‌.ఎల్‌ అనే మహిళకు ఐదు రోజుల క్రితం విరించి హాస్పిటల్స్‌లో హార్ట్‌ వాల్వ్‌ మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు.  విరించి హాస్పిటల్స్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ కార్డియాజిస్ట్‌, డాక్టర్‌ శరత్‌చంద్ర, మొదటిసారిగా హైదరాబాద్‌లో  సరికొత్తదైన హైడ్రా అరోటిక్‌ వాల్వ్‌ను ఉపయోగించి ఈ ప్రక్రియను నిర్వహించారు.

రోగి వేగంగా కోలుకోవడంతో ఆమెను హాస్పిటల్‌ నుండి డిశ్చార్జ్‌ చేశారు. గుండె నుండి శరీరంలోని ఇతర భాగాలకు రక్తం ప్రవహించేలా చేయడమే అరోటిక్‌ వాల్వ్‌ (బృహద్దమని కవాటం) యొక్క ప్రధానమైన విధి.

దేశీయంగా అభివృద్ది చేసిన హార్ట్‌ వాల్వ్‌ ఇంప్లాంట్‌ అయిన హైడ్రా అరోటిక్‌ వాల్వ్‌ బహుళ ప్రయోజనాలను కలిగివుంది మరియు రోగులకు దీనిని ఉపయోగించవచ్చని ఇటీవలనే ఆమోదాన్ని పొందింది. ఈ ఉపకరణం సాగేగుణంతో ఎంతో మృదువుగా ఉంటుంది, అందువలన వృద్దులలో వయస్సు కారణంగా కఠినంగా మరియు గట్టిగా మారిపోయే వారి యొక్క రక్త నాళాలలో ఎలాంటి అవాంతరాలు లేకుండా దీనిని సౌకర్యవంతంగా పంపించవచ్చు.

ఇంప్లాంట్‌కు ఉపయోగించే ట్రాన్స్‌ అరోటిక్‌ వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌ (టిఎవిఆర్‌) పద్దతిని సాధారణంగా వయస్సు మళ్ళిన రోగులలో ఉపయోగిస్తారు, ఎందుకంటే వారిలో రక్త నాళాలు కఠినంగా మరియు గట్టిగా మారే అవకాశం ఉంటుంది. హైడ్రా అరోటిక్‌ వాల్వ్‌ ఇంప్లాంటును తిరిగి వెనుకకు తీసుకోగలిగే సామర్ద్యం కలిగిన ప్రత్యేకతను కలిగివుండడం వలన దానిని సరైన స్థానంలో అమర్చబడని సందర్బాలలో ఇంప్లాంటును తిరిగి సులభంగా సరి చేయవచ్చు. 

దిగుమతి చేసుకున్న పరికరాలతో పోలిస్తే దాదాపు సగం ధర కంటే తక్కువలోనే ఈ దేశీయ ఇంప్లాంటు లభిస్తుంది, అధిక వైద్య ఖర్చులను భరించలేని భారతీయ రోగులకు ఇది గొప్ప ఉపశమనం కలిగించే అంశం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు తక్కువ ధర వంటి ప్రయోజనాలు ఉండడంతో విదేశాలలో కూడా దీనికి మంచి ఆదరణ లభిస్తున్నది. యూరప్‌ దేశాలకు ఎగుమతి చేసేందుకుగాను ఇప్పటికే దీనికి ఇసి ఆమోదం తెలిపింది. 

డాక్టర్‌ శరత్‌చంద్ర మాట్లాడుతూ, ఈ కొత్త పరికరం పలు ఆధునిక ప్రత్యేకతలతో టిఎవిఆర్‌ ప్రక్రియను చేసేందుకు ఒక ప్రధానమైన ఎంపికగా ఉంటూ, అటు వైద్య సమాజంతోపాటు ఇటు రోగులకు కూడా ప్రయోజనకరంగా ఉంటున్నది. భారతదేశంలో తయారైన ఈ పరికరం తక్కువ ఖర్చుతో పాటు అధిక ప్రయోజనాలను కలిగివున్నదని అన్నారు. ఈ రోగి 4 నెలల క్రితం గుండెపోటుకు గురై విరించి హాస్పిటల్స్‌కు వచ్చింది, ఆమెకు వెంటనే యాంజియోప్లాస్టీ చేశాము,

అదే సమయంలో ఆ రోగి అరోటిక్‌ వాల్వ్‌ బాగా కుంచించుకుపోయినట్లు పరీక్షల ద్వారా కనిపెట్టాము. కుంచించుకోపోయిన అరోటిక్‌ వాల్వ్‌కు చికిత్సకు సాధారణంగా శస్త్రచికిత్స చేసి సరిచేస్తారు. అయితే ఈ రోగికి ఈ మధ్యనే గుండెపోటు రావడం, వయస్సు కూడా ఎక్కువ ఉన్నది, రోగికి 74 ఏళ్లు, ఓపెన్‌హార్ట్‌ సర్జరీ చేస్తే రోగికి స్ట్రోక్‌ (పక్షవాతం) వచ్చే ప్రమాదం ఉన్నది. హైరిస్క్‌ రోగులలో ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ కంటే టావర్‌కే అధిక ప్రాధన్యం ఉన్నది.

పాశ్చత్య దేశాలలో అయితే వారి సగటు జీవితం ఎక్కువ కాబట్టి 80, 90 ఏళ్ల వారికి కూడా టావర్‌ చేస్తారు, వైద్యులు కూడా దానికే ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి, కొత్తగా ప్రవేశపెట్టిన పద్దతిలో చికిత్సను అందించాలని అనుకున్నాము. దీనిని టావర్‌ (టిఎవిఆర్‌) అంటారు కొంతమంది టావీ (టిఎవిఐ) అంటారు, మేము ప్రవేశపెట్టిన వాల్వ్‌ తనంతట తాను విస్తరించుకునే వాల్వ్‌. కొన్ని బెలున్‌తో ఓపెన్‌ అయ్యేవి ఉంటాయి, రోగి కోలుకుని హాస్పిటల్‌ నుండి డిశ్చార్జ్‌ అయ్యింది.

హైడ్రా వాల్వ్‌తో టావర్‌ను మొదటిసారిగా హైదరాబాద్‌లో చేయడం జరిగింది, రోగికి ఇంజక్షన్‌ అనేది చేయకుండా, చిన్న పంక్చర్‌ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది, వచ్చే 5 ఏళ్లలో వాల్వ్‌ తీసేసిన కూడా వెంటనే రక్తస్రావం ఆగిపోతుంది. హైడ్రా వాల్వ్‌కు ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది.

ఖర్చు కూడా ప్రామాణిక వాల్వ్‌తో పోలిస్తే 50% తక్కువే, ఈ హాస్పిటల్‌లో టావర్‌ చేయడం మొదటిసారి, అంతకుముందే గుండె ఆపరేషన్‌ చేయించుకున్నవారు, హార్ట్‌ ప్రాబ్లమ్‌ ఉన్నవారు, గుండె పనితీరు క్షీణించినవారిలో రెండవసారి హార్ట్‌ ఓపెన్‌ చేయలేరు కాబట్టి వాటికి సర్జరీ లేకుండా నేరుగా వాల్వ్‌ అమరుస్తున్నారు. అరోటిక్‌ వాల్వ్‌ రిప్లేస్‌మెంట్‌ బాగా ప్రాముఖ్యత పొందింది. ఓపెన్‌ హార్ట్‌ సర్జరీతో పోలిస్తే ఖరిదే కానీ హైరిస్క్‌ పేషెంట్లకు ఉపయోగకరం.

ప్రామాణిక కంపెనీ నుండి వాల్వ్‌ ఖరీదు చేస్తే ఎక్కువ అవుతుంది, అదే స్వదేశీ తయారీ అయిన హైడ్రా వాల్వ్‌ ఖరీదు తక్కువ మరియు స్టాండర్డ్‌ కంపెనీ నాణ్యతకు ఏ మాత్రం తీసిపోదు. అన్నారు.

ఎస్‌.ఎల్‌. నాలుగు నెలల క్రితం గుండెపోటుకు గురైంది. విరించి హాస్పిటల్స్‌లో ఆమె అత్యవసర యాంజియో ప్లాస్టీ చేయించుకుని దాని నుండి బాగా కోుకోవడం జరిగింది. అయినప్పటికీ సంబంధిత లక్షణాలతో పరీక్షలు నిర్వహించగా ఆమెకు ఆర్టిక్‌ వాల్వ్‌ స్టెనోసిస్‌ ఉన్నట్లు నిర్దారణ అయ్యింది, 3 నెలల తరువాత టిఎవిఆర్‌ చేయించుకోవలసిందిగా వైద్యులు ఆమెకు సలహా ఇవ్వడం జరిగింది. 

డాక్టర్‌ శరత్‌చంద్ర ఆమె పరిస్థితిని వివరిస్తూ, ‘‘గుండెకు అదొక క్లిష్టమైన పరిస్థితి, శరీరానికి ఒక దిశలో రక్తం సరఫరా చేసే గుండెకు సంబంధించిన ప్రధానమైన కవాటాలలో ఒకటి గట్టిగా మారిపోయి పూర్తి సామర్ద్యంతో పనిచేయడానికి ఆటంకం కలుగుతున్నది. అటువంటి పరిస్థితికి చికిత్స అందించకపోయినట్లయితే మళ్లీ మళ్లీ స్పృహ కోల్పోవడం, గుండె ఆగిపోవడం, స్ట్రోక్‌ మరియు ఆకస్మిక మరణం వంటి వాటికి దారితీయవచ్చు’’ అని అన్నారు. 

అంతకుముందే గుండెపోటుకు గురికావడం మరియు అధిక రక్తపోటు మరియు ఇతర దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితుతో, ఆమెకున్న వయస్సుకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేయడం మరింత ప్రమాదకరం. ఈ అంశాన్నింటినీ పరిశీలించిన తరువాత విరించి హాస్పిటల్స్‌ వైద్య బృందం మరింత వినూత్నమైనటువంటి ట్రాన్స్‌కాథటర్‌ అరోటిక్‌ వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌ (టిఎవిఆర్‌)ను చేయాలని నిర్ణయించింది.

విరించి హాస్పిటల్స్‌లో హైదరాబాద్‌లోనే అత్యాధునికమైన ప్యానెల్‌ కేథటర్‌ లేబరేటరీ (సంక్షిప్తంగా క్యాథ్‌-ల్యాబ్‌ అని అంటారు)ను మరియు సాంకేతికతను కలిగివుండడంతో వైద్య బృందం కొత్తగా ప్రవేశపెట్టిన హైడ్రా వాల్వ్‌ను రోగిలో విజయవంతంగా ప్రవేశపెట్టగలిగింది.

డాక్టర్‌ శరత్‌చంద్ర నాయకత్వంలో డాక్టర్‌ దీపక్‌ సాహా మరియు డాక్టర్‌ సుమీత్‌ సిన్హాలతో కూడిన ఇంటర్వెన్షనల్‌ కార్డియాజిస్ట్‌ల బృందం, కార్డియాక్‌ సర్జన్‌ డాక్టర్‌ అవినాష్‌ దాల్‌ మరియు అనెస్థీషియ  విభాగాధిపతి డాక్టర్‌ మురళీధర్‌ జోషిలతో పాటు హాస్పిటల్‌కు చెందిన మొత్తం హార్ట్‌ టీమ్‌ ఇందులో పాల్గొనడం జరిగింది. హైదరాబాద్‌లో హైడ్రా వాల్వ్‌ను ఇంప్లాంట్‌ చేయడం ఇదే తొలిసారి. 

డాక్టర్‌ అవినాష్‌ దాల్‌ మాట్లాడుతూ, వృద్ద రోగులు, ఒకేసారి రెండు కంటే ఎక్కువ దీర్గకాలిక వ్యాధులు ఉన్నవారు, బలహీనమైన గుండె కలవారికి ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేయడం రిస్క్‌తో కూడుకున్న పని, వారు కోలుకోవడం కూడా ప్రమాదంలో పడవచ్చు, అలాంటి రోగులకు తక్కువ కోతతో చేసే హార్ట్‌ లంగ్‌ మిషన్‌ మీద తక్కువ సమయం అదారపడే ఇలాంటి పద్దతి ప్రయోజనకరం. కార్డియాక్‌ సంరక్షణలో ఇదొక మైలురాయి, ఇందులో రోగి మనుగడ 99% మరియు హైరిస్క్‌ రోగులలో శస్త్రచికిత్స కంటే చాలా మెరుగైనది. 

డాక్టర్‌ దీపక్‌ సాహా మాట్లాడుతూ, టిఎవిఆర్‌ చేయించుకున్న రోగులు సాధారణ జీవితం గడపవచ్చు, కొద్ది రోజులలోనే తమ రోజువారీ పనులు చేసుకోవచ్చు, ఈ రోగి బాగా కోలుకున్నది మరియు నడవడం ప్రారంభించింది, నిన్న హాస్పిటల్‌ నుండి డిశ్చార్జ్‌ చేయడం జరిగింది. ఈ విధానం గుండె సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నది మరియు రోగులకు అత్యంత ప్రయోజనకరం కానున్నది. 

కొన్ని సంవత్సరాల క్రితం వరకు టిఎవిఆర్‌కు అవసరమైన ఇంప్లాంట్లను ప్రపంచవ్యాప్తంగా కేవలం రెండు కంపెనీలు మాత్రమే తయారు చేసేవి, అయితే భారతీయులలో అధిక శాతం మంది గుండె రోగులకు అరోటిక్‌ వాల్వ్‌ ఇంప్లాంట్‌ అవసరమని ఒక అంచనా ఉన్నందున,  ఎస్‌ఎమ్‌టి (సహజానంద్‌ మెడికల్‌ టెక్నాజీస్‌) వంటి దేశీయంగా వైద్య పరికరాలను ఉత్పత్తి చేసేటటువంటి సంస్థలు అత్యాధునిక మరియు ప్రమాణికమైన వైద్య పరికరాల తయారీలో ముందడుగు వేస్తున్నాయి.

పది లక్షలకు పైగా రోగులు ఇంప్లాంట్లతో 20 సంవత్సరాల నుండి ఎస్‌ఎమ్‌టి ఔషదీపూత కలిగిన కరోనరీ స్టంటు తయారీకి నమ్మకమైన పేరును కలిగివున్నది. తాజాగా హైడ్రా పేరుతో కంపెనీ సరికొత్త ఇంప్లాంట్‌ పరికరంను పరిచయం చేసింది, దీనిని  డిసిజిఐ వంటి భారతదేశ రెగ్యులేటరీ బాడీస్‌ ఆమోదాన్ని పొందింది, అదేవిధంగా యూరప్‌ కోసం సిఇ ద్వారా ఆమోదం పొందింది.

హైడ్రా అంతర్జాతీయ స్థాయికి ధీటుగా ఉత్పతి చేయబడినటువంటి ఇంప్లాంట్‌ ఇది సంపూర్ణమైన ప్రయోజనాలను అందించడంతో పాటు భారతీయలు ప్రధానంగా పరిగణనలోకి తీసుకునే తక్కువ ఖర్చు అనే ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. 

‘‘భారతదేశంలో వ్యక్తులు వైద్య ఖర్చును చాలా వరకు తమ సొంత ఆర్దిక వనరునుండే చెల్లిస్తుంటారు, ఆకస్మాత్తుగా ఇటువంటి క్లిష్టపరిస్థితులు ఎదురైనప్పుడు, అది మొత్తం కుటుంబాన్ని మానసికంగానే కాకుండా ఆర్దికంగానూ కృంగదీస్తుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంకు చెందినటువంటి హైడ్రా వాల్వ్‌ సిస్టమ్‌ వంటి వాటి వాడకం వలన నాణ్యత విషయంలో రాజీపడకుండా కుటుంబ ఆరోగ్యంపై శ్రద్ద చూపించేందుకు వీలు కల్పించి తద్వారా వారి ఆందోళనలో కొంత భాగాన్ని తగ్గిస్తుంది.

విరించి హాస్పిటల్స్‌లో మా రోగులకు అత్యున్నత వైద్య సంరక్షణా ప్రమాణాలను అందించేందుకు నిరంతరంగా  ప్రయత్నిస్తూనే ఉంటాము. ఎవిడెన్స్‌ బేస్‌డ్‌ మెడిసన్‌పై శ్రద్ద వహిస్తూ ప్రపంచస్థాయి సేవలు మరియు సౌకర్యాలను అందించడాన్ని కొనసాగిస్తాము’’ అని డాక్టర్‌ శరత్‌చంద్ర అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరద బాదిత కుటుంబాలకు ఆర్థిక సహాయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే: హైదరాబాద్ మేయర్