Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమం

Advertiesment
Green India
, శనివారం, 6 ఫిబ్రవరి 2021 (20:20 IST)
ఈ నెల 17న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హరిత తెలంగాణను స్వప్నిస్తున్న సీఎం సంకల్పానికి మద్దతుగా చంద్రునికో నూలు పోగు వలే,  ఒకే రోజు కోటి మొక్కలను నాటే కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని తీసుకున్నారు ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్.

కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు, మంత్రులు మహమూద్ అలీ, తలసాని, చేతుల మీదుగా ఇవాళ విడుదల చేశారు. మహబూబా బాద్ ‌యంపి మాలోతు కవిత, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా కేటీయార్ మాట్లాడుతూ.. తెలంగాణకు హరితహారం ద్వారా ఆకుపచ్చని రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి ఆశయాలు ప్రతిబించించేలా ప్రతీ ఒక్కరూ ఫిబ్రవరి 17న మూడు మొక్కలు నాటాలను కోరారు.

టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఎం.పీలు, ఎమ్మెల్సీలు,  ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు అందరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవటమే కేసీయార్ కు మనం ఇచ్చే పుట్టిన రోజు కానుక  అన్నారు. కోటి  వృక్షార్చన కార్యక్రమం తీసుకున్న పార్టీ జనరల్ సెక్రటరీ, ఎం.పీ సంతోష్ కుమార్ ను కేటీయార్, మంత్రులు అభినందించారు. 
 
ప్రతీ గ్రామం యూనిట్ గా సర్పంచ్ నేతృత్వంలో అన్ని చోట్లా ఖాళీ ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటాలని, పంచాయితీ రాజ్, అటవీశాఖలతో సమన్వయం ద్వారా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆకాంక్షించారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటి సంరక్షణ బాధ్యత కూడా ప్రతీ ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు.

ఆరేళ్ల హరితహారం ఫలితాలు ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్నాయని, ఎంపీ సంతోష్ నేతృత్వంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కూడా పచ్చదనం పెంపులో అన్ని వర్గాలను జాగృతం చేస్తోందని మంత్రులు మహమూద్ అలీ, తలసాని అన్నారు. 
 
రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంకల్పంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్  చేస్తున్న ఈ కోటి వృక్షార్చనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎం.పీ సంతోష్ కుమార్ కోరారు. జిల్లాల పర్యటనలో ఉన్న మంత్రలు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర మంత్రులు, నేతలకు కార్యక్రమం వివరాలు సంతోష్ కుమార్ ఫోన్ ద్వారా తెలిపి సహకారం కోరారు. 
 
సీఎం జన్మదినం సందర్భంగా కోటి వృక్షార్చనలో మొక్కలు నాటే వారందరికీ ప్రత్యేకంగా గుర్తించాలని, వనమాలి బిరుదును ఇవ్వాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భావిస్తోంది. ఆ రోజు మొక్కలు నాటుతూ దిగిన ఫోటోలను ప్రత్యేక యాప్ లో అప్ లోడ్ చేయాలి. 

యాప్ కోసం వాట్సప్ నుంచి 9000365000 నెంబర్ కు GIC అని మెసేజ్ చేయాలి. యాప్ లింక్ తో కూడిన మెసేజ్ తిరిగి వస్తుంది. దానిలో మొక్కలు నాటుతూ సెల్ఫీ ఫోటోలను ఎవరికి వారు అప్ లోడ్ చేయాలి.

కోటి వృక్షార్చనలో పాల్గొన్నందుకు గుర్తింపుగా ముఖ్యమంత్రి సందేశంతో కూడిన వనమాలి బిరుదు ఈ మెయిల్ లేదా మొబైల్ కు వారం రోజుల్లో ఎవరికివారికి చేరుతుందని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కరుణాకర్ రెడ్డి, రాఘవ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడిన పెద్దిరెడ్డిపై గవర్నర్ వెంటనే చర్యలు తీసుకోవాలి: గోరంట్ల బుచ్చయ్యచౌదరి