Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మునుగోడు ఓటర్లకు జాక్‌పాట్ : ఇంటికి తులం బంగారం...

Advertiesment
munugode voters
, ఆదివారం, 9 అక్టోబరు 2022 (12:52 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల మూడో తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డిపోరాడుతున్నాయి. ముఖ్యంగా, అధికార తెరాస, బీజేపీలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు ఇంటికి రూ.40 వేల నగదు లేదా తులం బంగారం ఇచ్చేందుకు కొన్ని పార్టీలు ఆసక్తి చూపుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
ఈ ఉప ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసే లోపు ఓటుకు కట్టిన ఈ ధర మరింత పెరిగే అవకాశముందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడమే ఈ పరిస్థితికి కారణమని విశ్లేషకులు అంటున్నారు. 
 
ఏదేమైనా ఓటర్లు కూడా ఈ  ఆఫర్లకు ఆకర్షితులైనట్టే కనిపిస్తోందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. నియోజకవర్గంలో నిర్వహించే ఓటరు నమోదు కార్యక్రమానికి వచ్చిన అనూహ్య స్పందనను ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈడబ్ల్యూఎస్ కోటా అభ్యర్థులు ఏం పాపం చేశారు : బండి సంజయ్