Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నెరవేరిన ఆదివాసీల చిరకాల స్వప్నం!

నెరవేరిన ఆదివాసీల చిరకాల స్వప్నం!
, శుక్రవారం, 18 జూన్ 2021 (08:01 IST)
webdunia
అనగనగా ఒక మారుమూల గిరిజన  గ్రామం అంటూ  మనం ఎన్నో కథలు చదువుతూవుంటాం వారి కష్టాలను వింటువుంటాం. ఇలాంటి కథలకు సరిగ్గా సరిపోయే ఉదాహరణగా ఈ గూడ లను చెప్పుకోవచ్చు. గూడలలో గుడిసెలు, మనుషులు  అడవి తప్ప వెళ్లేందుకు దారి కూడా సరిగా ఉండదు. వైద్యం కోసం వెళ్ళాలన్న, సరుకుల కోసం వెళ్ళాలన్న గుట్టలను దాటుతూ  కాలి నడకన వెళ్ళాల్సిన పరిస్థితి వున్నా మారుమూల గుడాలు అవి.
 
మావోయిస్టు ప్రబావిత ప్రాంతం ఆ రెండు గుడాలకు ఎటువంటి అత్యవసరమైన కాలి తోవనే శరణ్యము. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ గుడాలకు పోవాలంటే ట్రెక్కింగ్ (గుట్టలపైకి )రేషన్ కైనా, వైద్యానికైనా గుట్ట తోవే వారికి మార్గము.

ఇటువంటి పరిస్థితిలలో ఉన్న అక్కడి ఆదివాసుల కష్టాలను గుర్తించిన కోమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా పొలీసులు పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్ లో పోలీస్ మీ కోసం కార్యక్రమంలో భాగంగా వారి గుడాలకు రోడ్డు వేయించడము వారి ద్వారా కష్టాలకు కాలం చెల్లింది. వారి చిరకాల స్వప్నం నెరవేరింది. వారి ఒక తోవ చూపారు పోలీసులు. వివరాలలోకి వెళితే.....
 
కోమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలోని అత్యంత మారుముల ,మావోయిస్టు ప్రభావిత గ్రామము చోర్ పల్లి ఆ గ్రామ పంచాయతీ పరిదిలోని లెండిగూడ ,పునగూడ  గ్రామాలకు  ఎటువంటి రహదారి లేకపొవడముతో ఆయ గూడల ఆదివాసులు గుట్ట తోవలో కాలిబాటలో రావాల్సిందే.

కనీసం ఈ గ్రామము నుంచి  నిండుగర్భిణి నుంచి పండు ముసలి అయిన పసిపాప అయిన వైద్య సహాయమునకు కాలి నడకన వెళ్లలిసిందే,చివరకు జ్వరలతో మంచం ఎక్కిన ,అనారోగ్యము పాలైనవారిని దవాఖానకు అదే మంచం పైన నలుగురు మోస్తూ లేదా జోలెలో కాలినడకన మోసుకు రావాలసిందే 

లెండిగూడ 100 గుడిసేలతో 600 జనాభా ఉండగా, పునాగూడలో 8 గుడిశెలతో ౩౦ మంథి జనాభా కలదు వీరందరు రేషన్ కోసమైన ,కిరాణం సామాను కోసమైన ,వైద్యం కోసం ఐనా చోర్ పల్లి కి రావాల్సిందే . చోరుపల్లి నుండి లెండిగూడ కు 4 కి.మీ. దూరముండగా,బీమన్ గొంది నుండి పున గుడా కి 6 కి.మీ. దూరం  కలదు. 

ఈ వేసవి లో కోమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో "పోలిస్ మీకోసం" కార్యక్రమములొ భాగంగా ఈ గుడాలను సందర్శించిన జిల్లా అదనపు ఎస్ పి వై.వీ సుదీంద్ర, ఆసిఫాబాద్ డి ఎస్ పి ఎస్ ఆచేశ్వర్ రావు ఆదివాసీలు వారి గూడలకు రవాణా మార్గం అనేది లేక కనీసం కాలి తోవ కుడా సరిగా లేక వారు పడుతున్న ఇబ్బందిలను గమనించి వెంటనె అట్ఠి విషయాన్ని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇంచార్జి ఎస్.పి రామగుండం పోలీస్ కమీషనర్ వి.సత్యనాయరణ దృష్టికి తీసుకువెళ్ళారు.

సిపి స్పందించి వెంటనే  తప్పక ఆ గుడాలకు రోడ్డు వేయించాలని తెలపడముతో ఎస్.పి సుదీంద్ర ,అదనపు ఎస్ పి అచ్చేశ్వర రావుల పర్యవేక్షణలో జైనూర్ సిఐ హనోక్, లింగపుర్ ఎస్ ఐ మధుకర్ లు ప్రజల సహకారంతో ,స్థానికుల ట్రాక్టర్ లు ఏర్పాటు చేసుకుని  20 రొజులు శ్రమించి  రోడ్డు నిర్మాణ పనులను శేరవేగముగా పూర్తి చేసి ఆదివాసీల యొక్క చిరకాల స్వప్నంను నెరవేర్చారు. రెండు గుడాలకు దారి చూపారు.

దాదాపు రెండువేలకు పైగా ట్రిప్పులు మొరం వెయించి దానిపైన  వర్షకాలంలో మరల బురదకాకుండా కంకర పొడి వేపించడముతో ప్రస్తుతము ఆ గుడాలకు ఆటో లు సైతము వెళుతున్నాయి.
 
 తమ గూడలకు సైకిల్ నడవడమే గగనమైన పరిస్థితులలో ఆసిఫాబాద్ పోలిసుల చొరవతో ద్విచక్ర,వాహనాల,ఆటో లు ,తిరిగుతున్నాయని ఇదంతా పోలీసుల చొరవేనని ఆదివాసీ గూడల ప్రజలు ధన్యవాదములు కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నా లెండిగూడ,పునాగూడ ఆదివాసులు.
 
యువతకు వాలీబాల్ కిట్స్, బియ్యం, ప్రభుత్వం ఉద్యోగం కోసం పోటీ పరీక్షలకు పోటీ పడే వారికీ స్టడీ మెటీరియల్ సీపీ చేతులమీదుగా అందచేశారు.
 
ఒకవైపు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా లాక్ డౌన్ విధులు నిర్వహిస్తునే మరోవైపు కమ్యూనిటి పొలీసింగ్ లో బాగంగా ప్రజలతొ మమేకమై ఎన్నోయేండ్లుగా నెరవేరని  వారి రహదారి కల సాకారం కావడముతో పోలీసులని అభినందిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వచ్చే నెలలో జిందాల్ ప్లాంట్ ప్రారంభం: మంత్రి బొత్స