Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిర్యానీ తిందామని వెళ్లిన నలుగురు.. చివరికి వరదలో చిక్కుకుని..?

Advertiesment
బిర్యానీ తిందామని వెళ్లిన నలుగురు.. చివరికి వరదలో చిక్కుకుని..?
, గురువారం, 15 అక్టోబరు 2020 (10:35 IST)
బిర్యానీకి హైదరాబాద్ పెట్టింది పేరు. అలా మాంచి బిర్యానీ లాగించాలనుకున్న నలుగురు స్నేహితులు జనగామలో ఏదైనా బిర్యానీ సెంటర్‌లో డిన్నర్‌ చేసేందుకని కారులో ప్రయాణమయ్యారు. సుమారు రాత్రి 10 గంటల సమయంలో వారు బయలుదేరారు. 
 
జనగామ-హుస్నాబాద్‌ రహదారిపై వడ్లకొండ గ్రామం వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోందని పోలీసులు వారించినా కల్వర్టు మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వరద నీటి ఉద్ధృతితో కారు కొట్టుకుపోవడంతో నలుగురు యువకులు వరద నీటిలో చిక్కుకొన్నారు. 
 
అర్ధరాత్రి వరకు సహాయక చర్యలు చేపట్టి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వడ్లకొండ శివారు సుందరయ్యనగర్‌కు చెందిన రెడ్డబోయిన నరేశ్‌, రెడ్డబోయిన కనకరాజు, మరిగడికి చెందిన పుట్ట రవి, వట్నాల వెంకటేశ్‌ ఉదంతమిది. పోలీసు సిబ్బంది హెచ్చరించినా.. అత్యుత్సాహంతో కారు నడపటంతో వరద ఉద్ధృతికి ఆ వాహనం సుమారు అర కిలోమీటరు వరకు వాగులో కొట్టుకెళ్లింది. వాగు మధ్యలో ఉన్న తాటిచెట్టు కారును అడ్డుకుంది.
 
కారులోని ఒకరి చరవాణి ద్వారా వారి కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు సమాచారమందించారు. వెంటనే గ్రామస్థులు, పోలీసు సిబ్బంది ఉన్నతాధికారులు, పోలీసులకు సమాచారం అందించగా అందరూ హుటాహుటిన చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు చాలాసేపు పోరాడి వారిని కాపాడారు అధికారులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దసరా స్పెషల్ రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. వివరాలివే...