Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆన్‌లైన్‌లో వ్యభిచారం.. ఉగాండా ముఠా అరెస్ట్..

ఆన్‌లైన్‌లో వ్యభిచారం.. ఉగాండా ముఠా అరెస్ట్..
, శనివారం, 22 మే 2021 (12:31 IST)
పర్యాటక వీసాపై ఇండియా వచ్చి ఇక్కడ ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఉగాండాకు చెందిన ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
లోకాంటో డేటింగ్ యాప్ ద్వారా ఆన్ లైన్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఉగాండాకు చెందిన ఐదుగురు మహిళలను చైతన్యపురి పోలీసులతో కలిసి రాచకొండ యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్దనుంచి 20 గ్రాముల కెటామైన్ తో పాటు ఇతర మాదకద్రవ్యాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ ముఠా లోకాంటో డేటింగ్ యాప్ ద్వారా పురుషులను ఆకర్షించేలా ఫోటోలు పెట్టి ప్రోఫైల్స్ క్రియేట్ చేసి … పోలీసులు ట్రాక్ చేయకుండా ఉండేందుకు ఈ-వాలెట్ల ద్వారా వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.
 
నిందితులు టూరిస్ట్ వీసాపై భారత్ కుచేరుకున్నారని.. వీసాల గడువు ముగియడంతో అక్రమవ్యాపారానికి తెరతీశారని పోలీసులు తెలిపారు. వీరిలో మిల్లీ అనే మహిళ గతేడాది డిసెంబర్‌లో ముంబై చేరుకుంది. 
 
అక్కడనుంచి మార్చిలో హైదరాబాద్ వచ్చింది. టోలి చౌక్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె చికిత్సకూడా తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
 
ఉద్యోగాల పేరుతో ఉగాండ నుంచి మహిళలను రప్పించి ఇక్కడ వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నట్లు చెప్పారు. చైతన్యపురిలో కస్టమర్లకు కలిసేందుకు వచ్చినప్పుడు పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Ayurveda medicine Corona: ఆనందయ్య మందు ఐదు రకాలు, ఎవరెవరికి?